Saturday, April 20, 2024
- Advertisement -

వేదాద్రి రోడ్డు ప్రమాదంలో మృతులకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా : సీఎం జగన్‌

- Advertisement -

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి నిన్న భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వేగంగా బొగ్గు లారీ వచ్చి ఢీ కొట్టింది. దాంతో ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు, ఖమ్మం జిల్లా మధిరకు చెందిన 9 మంది మృతి చెందారు. ఇంకో 12 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం మత్తులో లారీని నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల విచారణలో తెలింది.

అయితే ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ ‌జగన్‌మోహన్‌రెడ్డి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రమదంలో మృతి చెందిన తెలంగాణ వారికి కూడా ఎక్స్ గ్రేషియా వర్తింప చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

బాదితులు మన రాష్ట్రం కాకపోయిన.. ప్రమాదం మన దగ్గర జరిగింది కాబట్టి మానవత్వంతో వారి కుటుంబాలను అదుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇక గాయపడినవారి వివరాలు తెలుసుకుని వారికి మంచి వైద్యం అందించాలని జగన్ ఆదేశించారు. ఇక ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రటించింది. ఈ పరిహారం ఆంధ్రా ప్రాంత మృతులకు కూడా వర్తింప చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

లోకేష్ పని అయిపోయిందా ? ఇక అరెస్టేనా ?

ఏపీ బడ్జెట్‌ ప్రధాన అంశాలు ఇవే.. ఏ రంగానికి ఎంతంటే ?

బాబూ క‌ప‌ట రాజ‌కీయాల‌కు కాలం చెల్లింది.

ప్రజల డబ్బు పందికొక్కుల్లా తిన్నా.. వదిలేయాలా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -