రాజకీయ కాడి వదిలేసిన పవన్.? ఇక సినిమాలేనా?

2240
CM YS Jagan Effect Pawan Kalyan U-Turns
CM YS Jagan Effect Pawan Kalyan U-Turns

రాజకీయాల్లో హత్యలుండవు. ఆత్మహత్యలే అంటారు. ఇప్పుడు దాన్ని నిజం చేస్తున్నారు మన పవన్ కళ్యాణ్. వైఎస్ జగన్ పాలన బాగా చేస్తే తాము సినిమాల్లోనే ఉంటామని.. ఇలా రోడ్లమీదకు ఎందుకొస్తామని తాజాగా విశాఖలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అది ప్రకటించిన కొద్దికాలానికే పవన్ మాటలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

సీఎం జగన్ మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రకటించారు ఆమోదించారు. టీడీపీ అమరావతి పేరుతో చేసిన దోపిడీని అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు. ఇక మూడు రాజధానులపై ఉత్తరాంధ్ర, సీమా వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

ఈ నేపథ్యంలో పవన్ మాట నిజమైంది. సోమవారం పవన్ కళ్యాణ్ కొత్త సినిమా హైదరాబాద్ లో ప్రారంభమైనట్టు తెలిసింది. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘పింక్’ తెలుగు రిమేక్ షూటింగ్ సోమవారం హైదరాబాద్ లో పవన్ ప్రారంభించడం విశేషం. ఆయన తన గడ్డం, జుట్టు కత్తిరించుకొని నీట్ గా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడం.. ఆ ఫొటోలు లీక్ కావడం వైరల్ గా మారింది.

పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో న్యాయవాది పాత్ర పోషిస్తున్నారు. హిందీలో ఈ పాత్రను అమితాబ్ బచ్చన్ పోషించాడు. అక్కడ తమిళం, ఇతర భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజ్, బోనీకపూర్ నిర్మిస్తున్నారు. ఫస్టు డే షూటింగ్ లో పవన్ గడ్డం తీసేసి కోర్టు హాలు సెట్టింగ్ లో షూటింగ్ లో పాల్గొన్నారు.

దీంతో పవన్ కళ్యాణ్ ఇక రాజకీయాలు వదిలేసి సినిమాల బాట పట్టినట్టు తెలుస్తోంది. జగన్ పాలన చూశాక పవన్ లోనూ ఇక రాజకీయాలు వదిలేశాయని అనిపించిందా అని వైసీపీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నాయి.

Loading...