Thursday, April 25, 2024
- Advertisement -

జగన్ పీఏ మృతి.. జగన్ ఏం చేశాడంటే ?

- Advertisement -

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నారయణ అనారోగ్యంతో మృతి చెందరు. నారయణను కు వైఎస్ ఫ్యామిలీతో దాదాపు మూడు దశాబ్దాల కు పైనే అనుబంధం ఉంది. అందుకే ఆయనను తమ కుటుంబ సభ్యుడిగా వైఎస్ ఫ్యామిలీ భావిస్తారు. ఇక నారయణతో జగన్ కు ఉన్న అనుబంధం కూడా ఎక్కువే.

నారాయణ మరణించిన వార్త గురించి సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీలో ఉన్న జగన్.. తన షెడ్యూల్స్ ను రద్దు చేసుకుని కడపకు బయలుదేరారు. నిజానికి ఈ రోజు ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షాలతో జగన్ భేటీ కావాల్సి ఉంది. అయితే.. తమకెంతో దగ్గర వ్యక్తి అయిన నారయణ మరణించిన విషయం తెలియడంతో వెనువెంటనే ఢిల్లీ నుంచి కడపకు జగన్ వచ్చారు.

అక్కడి నుంచి అనంతపురం జిల్లా నారాయణ సొంతూరైన దిగువ పల్లెకు వెళ్లనున్నారు. సాయంత్రం 3.30 గంటల సమయానికి నారాయణ ఇంటికి చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడ నుంచి నేరుగా తాడేపల్లికి సీఎం జగన్ వెళ్లనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -