Thursday, March 28, 2024
- Advertisement -

ప్రతిపక్షాలకు చెక్ పెట్టేందకు జగన్ స్కెచ్…బాబు,లోకేష్ కు ముసల్లపండగే

- Advertisement -

ఏపీ సీఎం పాలన వంద రోజులు పూర్తి చేసుకుంది. ఆయన చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు నభూతో.. నభవిష్యత్ అనేలా ఉంటున్నాయి. సీఎం పాలనపై బాబు, లోకేష్ లు విరుచుకు పడుతున్నారు. లోకేష్ ట్విట్టర్ లో జగన్ పై దాడి చేస్తుంటె బాబు డైరెక్ట్ గా విమర్శలు ఎక్కుపెట్టారు. గతంలో పాలన అనుభవం లేకపోవడంతో కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకున్న జగన్ ఇప్పుడు ప్రతిపక్షాలను ఓ ఆట ఆడుకోనున్నారు. ప్రధానంగా బాబు,లేకేష్ లే టార్గెట్ గా జగన్ కార్యాచరణ ఉండబోతోంది.

సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు జనాలపై సంక్షేమ వరాలు కురిపిస్తూ.. విపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా దూకుడు పెంచనున్నారు. నవరత్నాల పథకాలతో అధికారంలోకి వచ్చిన జగన్ వాటినన్నింటిని అమలు చేసె ప్రయత్నంలో ఉన్నారు. నెలకొక పథకం చొప్పున ప్రారంభించానున్నారు.

ప్పటికే నాణ్యమైన బియ్యాన్ని అందజేసే పథకాన్ని ప్రారంభించారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని మాటిచ్చిన జగన్.. సెప్టెంబర్‌ చివరి వారంలో వారికి డబ్బులు ఇవ్వబోతున్నారు.సెప్టెంబర్ 10 నుంచి దీనికి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మార్గ దర్శకాలు విడుదల చేసింది ప్రభుత్వం.

అక్టోబర్‌ 15న జగన్ సర్కారు రైతు భరోసాను అందజేయనుంది. ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 అందజేయనున్నారు.నవంబర్‌ 21న ప్రపంచ మత్య్స దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు రూ.10 వేలు ఇవ్వనున్నారు.డిసెంబర్లో.. ప్రతి చేనేత కుటుంబానికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా అమ్మఒడిని ప్రారంభిస్తారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ రూ.15 వేలు అందజేయనున్నారు. ఈపథకాలన్ని సక్రమంగా అమలు అవుతున్నాయా లేదా అన్నదానిని తెలుసుకొనేందుకు జగనే స్వయంగా రంగంలోకి దిగనున్నారు. పథకాలన్ని సక్రమంగా అమలు అయితే జగన్ నువిమర్శించడానికి ప్రతిపక్షాలకు ఏమి ఉండవు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -