1,088 అంబులెన్స్‌లను ప్రారంభంచిన జగన్ సర్కార్..!

324
cm ys jagan launching fully infrastructured ambulance services
cm ys jagan launching fully infrastructured ambulance services

ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ది కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అయితే ప్రజారోగ్య రంగంలో చాలా ముఖ్యమైన అత్యవసర సేవలందించే 108, 104 అంబులెన్స్‌లను ప్రజలకు అందుబాటులోకి తేవడంలో జగన్ సర్కార్ కీలక అడుగు వేసింది. ఇప్పటికే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలకుపైగా ఆరోగ్యశ్రీ ద్వారా భరోసా కల్పించిన సీఎం జగన్‌ ఇప్పుడు అత్యవసర వైద్య సేవలందించే 108, 104 సర్వీసుల్లో కూడా తనదైన ముద్ర వేశారు.

ఒకేసారి ఏకంగా 1,088 వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో జెండా ఊపి ప్రారంభించారు. విజయవాడ నుంచి అంబులెన్సులు కుయ్, కుయ్ అంటూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తరిలివెళ్ళాయి. ఇక ఈ మొత్తం 1,088 వాహనాల్లో 676 వాహనాలు 104 కాగా.. మరో 412 వాహనాలు 108 వాహనాలు. ఈ వాహనాల్లో 282 బేసిక్‌ లైఫ్‌ సపోర్టు (బీఎల్‌ఎస్‌)కు సంబంధించినవి. అలాగే 104 అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్టు (ఏఎల్‌ఎస్‌)తో తీర్చిదిద్దారు. మరో 26 అంబులెన్సులను చిన్నారులకు (నియో నేటల్‌) వైద్య సేవలందించేలా రూపొందించారు.

మారుమూల గ్రామల్లో కూడా వైద్య వేస్లందించేలా అన్ని వసతులతో ఎంఎంయూలను సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒక సర్వీసు అందుబాటులో ఉండేలా వాహనాలను సిద్దం చేశారు. దాదాపు 203.47 కోట్లతో ఈ అంబులెన్స్ లను కొనుగోలు చేసింది ప్రభుత్వం. ప్రతి మండలంలో ఎక్కడైన ప్రమాదం చోటు చేసుకుంటే అక్కడికి 20 నిమిషాల్లో అంబులెన్స్ చేరేలా ప్రభుత్వం రూట్ మ్యాప్ సిద్దం చేసింది. ఇంత మంచి నిర్ణయం తీసికున్నందుకు వైఎస్ జగన్ పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అనుచరుడి భాస్కరరావు అంత్యక్రియల్లో కుప్పకూలిన నాని..!

మహిళా ఉద్యోగినిపై దాడి చేసిన సహ ఉద్యోగి..!

పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాపాక వరప్రసాద్

బ్రేకింగ్ : మచిలీపట్నంలో వైసీపీ నేత దారుణ హత్య..!

Loading...