ఉచితంగా ఇసుక పంపిణీ : జగన్ సంచలన నిర్ణయం..!

774
CM Ys Jagan sensational decision On Sand
CM Ys Jagan sensational decision On Sand

అధికారంలోకి రావడం ఆలస్యం.. ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణాయలతో ముందుకు సాగుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తాజా ఏపీ సీఎం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇసుక దొరక్క ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారికి గుడ్ న్యూస్ చెప్పారు. ఇసుక పాలసీలో అవకతవకలు ఉండకుండా చూడాలని ఆధికారులను ఆదేశించారు.

తాజాగా ఇసుక పాలసీలో కొన్ని సవరణలు చేసి కీలక ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో భాగంగానే పేదలకు ఉచితంగా ఇసుకను సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇంటి అవసరాలకు పేదలకు ఫ్రీగా ఇసుకను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. గత కొద్ది రోజులుగా ఇసుక విషయంలో గౌవర్నమెంట్ పై విమర్శలు రావడంతో ఈ మార్పులు చేసింది. అలానే బలహీన వర్గాలకు మంజూరు చేసే ఇళ్ల నిర్మాణాలకు కూడా ఇసుకను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ వార్డు సచివాలయాల నుంచి ఎలాంటి ఛార్జీలు లేకుండా పర్మిట్లు తెచ్చుకునే అవకాశాన్ని కల్పించింది.

హౌసింగ్ స్కీమ్ ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ గృహ నిర్మాణాలకు కూడా ఉచితంగా ఇసుక సరఫరా చేసే విధంగా ప్రభుత్వం పలు సవరణలను చేసింది. కాగా వాగులు యేర్లలోని ఇసుకను స్థానిక అవసరాలకు పేదలు ఎడ్లబండ్లు ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లే వెసులుబాటును కల్పించింది. ఇందుకోసం వారు ముందుగా సచివాలయ అధికారుల నుంచి ఉచిత సర్టిఫికెట్లు తీసుకోవాలని సూచించింది. వర్షాకాలం ప్రారంబం కావడంతో ఇసుక రవాణా విషయంలో ప్రణాళికాబద్దంగా ముందు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తోంది.

లాక్ డౌన్ పెట్టడం పై.. టెస్టులు పై మంత్రి ఈటెల క్లారిటీ..!

లోకేష్ పని అయిపోయిందా ? ఇక అరెస్టేనా ?

అచ్చెం నాయుడు ఆరోగ్యంపై జగన్ సంచలన నిర్ణయం..?

ప్రజల డబ్బు పందికొక్కుల్లా తిన్నా.. వదిలేయాలా..?

Loading...