Tuesday, April 16, 2024
- Advertisement -

నేను గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే….బాబుకు ప్రతిప‌క్ష హోదా కూడా ద‌క్క‌దు…

- Advertisement -

ఫిరాయింపులపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రతిపక్షనేత చంద్రబాబు-సభ నాయకుడు జగన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. వైఎస్‌ జగన్‌ది రాజకీయ కుటుంబం.. ఆయన తండ్రి ముఖ్యమంత్రి.. వైఎస్ రెడ్డి కాంగ్రెస్‌లో గెలిచి.. నాలుగు రోజుల్లో పార్టీ మారిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. మీ తండ్రి చేసిన తప్పుని ఒప్పుకోండి.. మీరు అంటున్నారుగా తండ్రికి తగ్గ కొడుకు అంటున్నారుగా.. చరిత్రను ఎవరూ మార్చలేరు కదా’ అన్న బాబు మాట‌ల‌కు జ‌గ‌న్ ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు.

తాను ఏ స్థాయిలో విలువలు పాటించానో ప్రజలు చూశారన్నారు. టీడీపీ ప్రభుత్వం చట్టాలకు తూట్లు పొడిచింద‌న్నారు. తాను కూడా చంద్రబాబు లాగా రాజకీయాలు చేస్తే.. ఇవాళ ప్రతిపక్ష నేతగా కూర్చొనే వారు కాదన్నారు. ఆయన పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నారు. తనతో టీడీపీ నేతలు టచ్‌లో ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను డోర్ తెరిస్తే.. చాలామంది రావడానికి రెడీగా ఉన్నారంటూ ఘాటుగా వ్యాఖ్య‌లు చేవారు.

23 మంది ఎమ్మెల్యేల‌ను సంత‌లో ప‌శువుల్లా కొన్నార‌ని అంత‌టితో ఆగ‌కుండా న‌లుగురిని మంత్రులుగా చేశార‌ని మండిప‌డ్డారు. తాను గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీ మొత్తం ఖాళీ అవుతుందన్నారు జగన్. టీడీపీ చేసిన రాజకీయాల్ని … ‘గూబ గుయ్’ అన్నట్లు జగన్ తీర్పు చెప్పారన్నారు. అందుకే కేవలం 23 మంది ఎమ్మెల్యేలే టీడీపీలో గెలిచారన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేశారు అంతే సంఖ్య టీడీపీకి వచ్చిందని వ్యాంగ్య‌స్త్రాలు సంధించారు.

జ‌గ‌న్ అన్న‌ది నిజ‌మే క‌దా. జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే టీడీపీ ఖాలీ అవుతుంది. కాని బాబులాగా అనైతికి రాజ‌కీయాలు చేయ‌న‌ని అలా చేస్తే..నాకు బాబుకు తేడా ఏముంట‌ద‌న్నారు. పైగా టిడిపి నుండి వైసిపిలోకి దూకేయటానికి కొందరు ఎంఎల్ఏలుగా సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది.

చంద్రబాబు చేసిన పనే తాను కూడా చేస్తే తామిద్దరికీ తేడా ఏముంటుందని జగన్ వేసిన ప్రశ్నకు టిడిపి నేతలు సిగ్గుపడాలి. తాను కొన్ని విలువలకు కట్టుబడిన వాడినని జగన్ చెప్పుకోవటంలో అతిశయోక్తి ఏమీ లేదు. పార్టీలోకి రావాల్సిన వారు త‌మ ప‌దువుల‌కు రాజీనామా చేసి రావాల‌న్నారు. అలా చేయ‌క‌పోతె ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని స్పీక‌ర్‌కు సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -