జిల్లాల విభజన.. ఎవరూ ఊహించిన సర్ ఫ్రైజ్ ఇవ్వనున్న సీఎం జగన్..!

1086
CM YS Jagan Shocking Surprise
CM YS Jagan Shocking Surprise

ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి ఏపీ ముఖ్యమంత్రి ఏపీ లో ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మొత్తం 13 జిల్లాలను 25 జిల్లాలగా చేస్తానని హామీ ఇచ్చి ఉన్నారు. ఈ హామీ నిలబెట్టుకోవడం చాలా మంచిదనడంలో సందేహం లేదు. కానీ ఈ జిల్లాలను విభజించేటప్పుడు ముఖ్యంగా ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ 2026 సంవత్సరం లో శాసనసభ నియోజకవర్గాలు ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా మారనున్నాయి. శాసనసభ నియోజకవర్గాలు 175 నుంచి 225 నియోజకవర్గ జరగడానికి అవకాశం ఉంది.

అలాగే 25 లోక్సభ నియోజకవర్గాలు కూడా పెరగనున్నాయి. అయితే మళ్లీ జిల్లాలను పునర్విభజన చేయలేము. ఈ 25 జిల్లాల ప్రక్రియ లోకసభ సభ్యులకు మాత్రమే ఉపయోగం. కానీ అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడదు. ఏఏ జిల్లాలు ఏర్పాటు చేయాలనేది ఆయ జిల్లాల భౌతిక రాజకీయ ఆర్ధిక సామాజిక స్థితిగతులు ప్రజలు వెనుకబాటుతనం గిరిజన ప్రాంతాల అభివృద్ధి ప్రాంతానికి ప్రాంతానికి మధ్య రవాణా సదుపాయాలు కొండ అటవీ ప్రాంతాలు ముఖ్యంగా ఉద్యోగస్తుల జోనల్ జిల్లా కేడర్ అంశాలను పరిగణలోకి తీసుకొని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం చాలా మంచిది.

ఈ విధంగా చేస్తే అన్ని ప్రాంతాలకు అభివృద్ది సమానంగా జరగడానికి అవకాశం ఉంది. జిల్లాలోని విభజించేటప్పుడు జిల్లాలు పెద్దవా చిన్నవా అంశాన్ని పరిగణనలోకి తీసుకోకూడదు. విభజించేటప్పుడు కొన్ని జిల్లాలు పెద్దగా కొన్ని జిల్లాలు చిన్నగా ఉండడం సహజం. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాల హద్దులు మార్చకుండా జిల్లాల పునర్విభజన జరగడం మంచిది. మొత్తం ఇప్పుడు ఉన్న పదమూడు జిల్లాలను 32 జిల్లాలుగా చేయవలసి ఉన్నది.

ఏపీలో కొత్త జిల్లాలు ఈ విధంగా ఏర్పాటు చేయవలసి ఇంది. శ్రీకాకుళం జిల్లా, పాలకొండ జిల్లా, విజయనగరం జిల్లా, పార్వతీపురం జిల్లా, విశాఖపట్నం జిల్లా ,అనకాపల్లి జిల్లా, అరకు లేదా పాడేరు లేదా అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా లేదా రాజరాజ నరేంద్ర జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, రంపచోడవరం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా లేదా వశిష్ట గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, పోలవరం జిల్లా, విజయవాడ కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ మచిలీపట్నం జిల్లా, గుంటూరు జిల్లా, నరసరావుపేట జిల్లా, బాపట్ల జిల్లా, టంగుటూరు ప్రకాశం జిల్లా, మార్కాపురం లేదా కనిగిరి జిల్లా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఉదయగిరి లేదా సూళ్లూరుపేట జిల్లా, బాలాజీ లేదా శ్రీ వెంకటేశ్వర తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, శ్రీకృష్ణదేవరాయ అనంతపురం జిల్లా, హిందూపురం జిల్లా, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, శ్రీశైలం మల్లికార్జున జిల్లా, రాజంపేట జిల్లా లేదా అన్నమయ్య రాజంపేట జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా.

చంద్రబాబు ఓ చక్రవర్తిలా కలగన్నాడు..!

శుక్రవారం.. శుక్రవారం.. బాధపెట్టిన టీడీపీకి అదే శుక్రవారం జలక్ ఇచ్చిన జగన్..!

చంద్రబాబుకు షాక్ : టీడీపీ కీలక నేత ఆ పార్టీకి గుడ్ బై..!

జగన్ కొత్త సూత్రానికి ఫిదా అయిన మోడీ.. ?

Loading...