Tuesday, April 23, 2024
- Advertisement -

సీఎం జగన్ సంచలన నిర్ణయం….పార్టీపరిస్థితిపై బాబు ఆందోళన

- Advertisement -

సీఎం జగన్ తీసుకున్న కొత్త సంచలన నిర్ణయం భవిష్యత్తులో టీడీపీ ఉనికి కోల్పోయె పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాబు అధికారంలో ఉన్ననాల్లు ఉద్యోగాలను భర్తీ చేస్తామని మాటలు చెప్పడం నిరుద్యోగులని మోసగించడం తప్ప ఉద్యోగాలను భర్తీ చేయలేదు. కాని జగన్ మాత్రం అన్ని శాఖల్లో ఖాలీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి జనవరిలోను ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఉద్యోగాలు రాని వాల్లు అధైర్య పడాల్సిన పనిలేదని…ఉద్యోగాలన్నింటిని భర్తీ చేస్తామని యుద్ధానికి సిద్ధంగా ఉండండని నిరుద్యోగులకు పిలుపు నిచ్చారు.

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన యువతకు జగన్ నియామక పత్రాలను జగన్ అందించారు. ప్రతి జనవరిలోను ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అందుకని నిరుద్యోగులు అప్లికేషన్లు పెట్టుకోవటానికి రెడీగా ఉండాలంటూ పిలుపుకూడా ఇచ్చారు.మొత్తానికి చెప్పిన మాట గనుక జగన్ నిలబెట్టుకుంటే ప్రతిపక్షాల పని అందులోను చంద్రబాబునాయుడు పని దాదాపు అయిపోయినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎందుకంటే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే జగన్ దాదాపు 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయల్లో వివిధ ఉద్యోగాలను భర్తీతో శ్రీకారం చుట్టిన జగన్ ఖాలీగా ఉన్న ఉద్యోగాలన్నింటిని భర్తీ చేయనున్నారు.అదే గనుక జరిగితే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వ శాఖల్లో దాదాపు 3 లక్షల ఉద్యోగాలు భర్తీకి నోచుకోకుండా సంవత్సరాల తరబడి ఉండిపోయాయి. నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు ఆడుకున్నట్లుగా జగన్ ఆడుకునేందుకు సిద్దంగా లేరు. అందుకే ప్రతీ జనవరిలోను ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తానని జగన్ ప్రకటించగానే అందరూ హర్షం తెలుపుతున్నారు. ఉద్యోగాలన్నింటిని భర్తీ చేస్తే భవిష్యత్తులో పార్టీ పరిస్థితి ఏంటని బాబు ఆందోళనలో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -