Friday, March 29, 2024
- Advertisement -

రాజధాని నిర్మానంపై జగన్ మదిలో కొత్త ఆలోచన… బాబుకు డబుల్ స్ట్రోక్

- Advertisement -

గత రెండు మూడు రోజుల నుంచి ఏపీ రాజధాని అమరావతి మార్పుపై వైసీపీ మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపాయి. బొత్స చేసిన వ్యాఖ్యలపై బాబ అండూ కో గగ్గోలు పెట్టింది. అసలు జగన్ మనసులో ఏముందని ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనె జగన్ టీడీపీ హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలను సమీక్షిస్తూ ముందుకెల్తున్నారు. రాజధాని పేరుతో వేల ఎకరాలు కుంభకోణం జరిగిందని వైసీపీ నేతలు మొదటి నుంచి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

బొత్సా చేసిన వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చారు ఇతర మంత్రులు. రాజధానిని అమరావతి నుంచి మరో ప్రాంతానికి మార్చబోమని ఏపీ మంత్రులు, ఇతర నేతలు క్లారిటీ ఇస్తున్నా జగన్ మనసులో ఏముందనేది ఇప్పడు అందరిలో ఆలోచన రేకెత్తిస్తోంది. రాజధాని విషయంలో బాబు అండ్ కో చేస్తున్న డ్రామాలకు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ నిర్ణయం ఉండబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో జరిగిన పొరపాటును మరో సారి జరగకుండా జగన్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అంతా హైదరాబాద్ పరిసరాలకు మాత్రమే పరిమిత కావడంతో విభజన తరువాత ఏపీ నష్టపోయిందనే భావనలో సీఎం జగన్ ఉన్నారని తెలుస్తోంది. అమరావతి విషయంలో మళ్లీ ఇదే తప్పు జరగవద్దని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వం… ఈ అంశాన్ని ముందుగా ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అవగాహన కలిగించేందుకు ప్రణాలికలు రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే యోచనలో ఉన్న వైసీపీ ప్రభుత్వం… దీన్ని కేవలం పరిపాలన అంశానికి మాత్రమే పరిమితం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అనేక ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలను కేవలం అమరావతికి మాత్రమే పరిమితం చేయాలనే ఆలోచనకు సీఎం జగన్ విముఖంగా ఉన్నారని సమాచారం

అభివృద్ధి అంతా అమరావతికి మాత్రమే పరిమితం అయితే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని అలా కాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్రలో సైతం ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదలా ఉంటే మరో వాదన కూడా తెరపైకి వస్తోంది.

విదేశాల్లో ఇలాంటి క్లిష్ట సమస్యలు వస్తే రెఫరెండం (ప్రజల అభిప్రాయం) తీసుకుంటారు. ఇప్పుడు అదే రెఫరెండాన్ని రాజధానిపై ఏపీ సీఎం జగన్ నిర్వహించడానికి రెడీ అయినట్లు సమాచారం.ఒకే దెబ్బకు రెండు పిట్టల వలే అటు టీడీపీ విష ప్రచారాన్ని ఎండగట్టడంతోపాటు ఇటు ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాజధానిని నిర్మించడానికి జగన్ ఈ భారీ ఎత్తుగడ వేసినట్లు సమాచారం. ఏదేమైనా రాజధాని విషయంలో జగన్ క్లారిటి ఇస్తే గాని ఇలాంటి ఊహాగానాలకు తెరపడదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -