Wednesday, April 24, 2024
- Advertisement -

ఇద్ద‌రి మ‌ధ్య‌లో బాబు…… ఏమి సేతురా లింగా….

- Advertisement -

ముందు నుయ్యి….వెనుక గొయ్యిలాగా త‌యార‌య్యింది ప్ర‌స్తుతం బాబు ప‌రిస్థితి. ఎంపీ,ఎమ్మెల్యేల మ‌ధ్య‌నున్న ఆధిప‌త్య‌పోరును తీర్చ‌లేక త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. జ‌గ‌న్‌ను సీమ‌లో దెబ్బ‌తీయాల‌ని బాబు వేస్తున్న ప్లాన్‌లు బెడిసికొట్ట‌డంతో జుట్టు పీక్కుంటున్నారు. అనంతో టీడీపీ వ‌ర్గ‌పోరు తారాస్థాయికి చేరింది.

మూడున్న‌ర్ర సంత్స‌రాలుగా అనంత‌పురంలోని రోడ్ల విస్త‌ర‌ణ వివాదాం ఇప్పుడు పీక్ స్టేజికి వెల్లింది. రోడ్ల విస్తరణ చేపట్టాలని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడు ప్రయత్నించినా.. దానిని మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతుతో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అడ్డుకుంటూ వస్తున్నారు. తాజాగా జేసీ రాజీనామా అస్త్రాన్ని ఉపయోగించగా.. చంద్రబాబు కాస్త తొలగ్గారు. దీంతో వెంటనే ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మళ్లీ రంగంలోకి దిగి.. చంద్రబాబుకి తలనొప్పిగా మారారు. దీంతో ఇద్దరిలో ఎవరికి సర్ది చెప్పాలో తెలియక అవస్థలు పడుతున్నాడు చంద్రబాబు

జేసీ దివాకర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన నేత. అనంతపురం ఎంపీగా ఉన్న ఆయనకు.. అక్కడి ప్రధాన సామాజిక వర్గమైన కమ్మవారితో మొదటి నుంచి సఖ్యత లేదు. ఆయనకు కేవలం బీసీ, ఎస్సీ, రెడ్డిలు మాత్రమే మద్దతుగా నిలుస్తున్నారు. వ‌చ్చె ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ను ఓట్లు అడ‌గాలంటె మాకు ఏంచేశార‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తారు. 2019 ఎన్నిక‌ల్లో తన కుమారుడు పవన్ రెడ్డిని ఎన్నికల్లో దింపాలని జేసీ యోచిస్తున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

కనీసం అనంతరపురం రోడ్ల విస్తరణ చేపట్టలేకపోయానని, చాగల్లు నుంచి తాడిపత్రికి నీటిని విడుదల చేయలేకపోయానని మీడియా ముఖంగా చెప్పాడు.వాట‌న్నింటికి బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. దాంతో చంద్రబాబుకి మరో తలనొప్పి మొదలైంది. అనంతపురంలో కమ్మ సామాజికవర్గంలోని వ్యాపారస్థుల పై ఉన్న కోపంతోనే రోడ్ల విస్తరణ చేపడుతున్నారంటూ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యేకి మద్దతుగా మరి కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు కూడా జతకలిశారు. వీరంతా.. జేసీకి ఇచ్చిన హామీలను వెనక్కి తీసుకోవాలంటూ చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. వీరిని కాదంటె వారి మద్దతు దారులను , కమ్మ ఓట్లను కోల్పోయే అవకాశం ఉంది. అలా కాదని..వీరికి మద్దతు ఇస్తే.. జేసీకి మద్దతుగా నిలిచిన రెడ్డి, బీసీ కులస్థుల ఓట్లు కోల్పోయే అవాకశం ఉంది. దీంతో ఏంచేయాలో తెలియ‌క ముందునుయ్యి…వెనుక గొయ్యిలాగా త‌యార‌య్యింది బాబు ప‌రిస్థితి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -