Friday, April 19, 2024
- Advertisement -

ల‌గ‌డ‌పాటిని చావు దెబ్బ కొట్టిన తెలంగాణా ప్ర‌జ‌లు….

- Advertisement -

లగడపాటి రాజగోపాల్.. సర్వేల విషయంలో దిట్టగా పేరున్న ఈ రాజకీయ నేత లెక్క మొట్టమొదటిసారి ఘోరంగా తప్పింది. ఆయన చెప్పిన ఫలితాల లెక్కలు దారుణంగా తప్పాయి. తెలంగాణా ప్ర‌జ‌లు ల‌గ‌డ‌పాటికి దిమ్మ‌తిరిగి బొమ్మ క‌నిపించేలా తీర్పునిచ్చారు. మహా కూటమి 65 సీట్లు పైగా గెలుచుకుంటుందని ఆయన చెప్పినా ఆ లెక్క 20 కూడా దాటలేదు.

ఫ‌లితాల‌ను చూస్తే ల‌గ‌డ‌పాటి నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డింది. చంద్ర‌బాబుకు తొత్తుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న అనుమానాలు ప‌టాపంచ‌ల‌య్యాయి. జాఫ్రంట్ గెలుస్తుంద‌ని రాజ‌గోపాల్ అస‌త్య ప్ర‌చారాలు చేశారు. త‌న ఎగ్జిట్ జోస్యంతో తెలంగాణ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బతీసే ప్ర‌య‌త్నం చేశారు. త‌ప్పుడు లెక్క‌ల‌తో మైండ్ గేమ్ ఆడారు. కానీ తెలంగాణ ప్ర‌జ‌లు మాత్రం కేసీఆర్ పాల‌న‌నే న‌మ్ముకున్నారు. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్న కేసీఆర్‌కే ప‌ట్టం క‌ట్టాల‌ని నిర్ణ‌యించారు.

మేజిక్ ఫిగర్ ను దాటి మరిన్ని స్థానాల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమవుతుందని తెలుస్తోంది. ఆ పార్టీకి 35 కంటే సీట్లు వచ్చే అవకాశం లేదని లగడపాటి తన సర్వేలో చెప్పారు. కానీ ఎవరూ ఊహించని విధంగా 85కు పైగా సీట్లు సాధించి వరుసగా రెండోసారి అధికారం అందుకోబోతోందంటూ త‌న స‌ర్వే ఫ‌లితాల‌ను వెల్ల‌డించారు.

లగడపాటి చెప్పినట్లు ఎక్కడా కూడా 10 మంది స్వతంత్రులు విజయకేతనం ఎగురవేసే స్థాయిలో కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఇద్దరు ఇండిపెండెంట్లు మాత్రమే ఆధిక్యత కనబరుస్తున్నారు. దీంతో ఇండిపెండెంట్ల వ్యవహారంలో ఆంధ్రా ఆక్టోపస్ సర్వే బోల్తా కొట్టిందని చెప్పుకోవాలి.

లగడపాటి రాజగోపాల్ సర్వేకు దొరకకుండా ఓటరు తీర్పునిచ్చారు. లగడపాటి సర్వే అంఛనాలను సైతం తారుమారు చేశారు. లగడపాటి రాజగోపాల్ సర్వేలో ఈ సర్వే చెత్తదిగా టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఇకపోతే పోలింగ్ శాతం పెరిగితే టీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం తప్పదంటూ లగడపాటి జోస్యం చెప్పారు. కానీ తెలంగాణలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో 68.5శాతం పోలింగ్ నమోదైతే ఇప్పుడు 73 శాతం పోలింగ్ నమోదైంది.

తెలంగాణ సెంటిమెంట్‌లో లోపం లేద‌ని చూపారు. త‌మ ఓటు హ‌క్కుతో మ‌రోసారి సంచ‌ల‌నం సృష్టించారు. సుస్థిర అభివృద్ధి దిశ‌గా ప‌య‌నిస్తున్న తెలంగాణ‌పై ఆంధ్రా నేత‌లు త‌మ పెత్తనాన్ని ఇంకా ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ల‌గ‌డ‌పాటి త‌న స‌ర్వేతో వెల్ల‌డించారు. నీచ రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆంధ్రా అక్టోప‌స్‌కు .. తెలంగాణ ఓట‌ర్ల త‌మ‌దైన శైలిలో ఓటు రుచి చూపించారు. ల‌గ‌డ‌పాటికి మాత్రం తెలంగాణా ప్ర‌జ‌లు చెంప చెల్లుమ‌నిపించార‌న‌డంలో సందేహంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -