ఇర‌కాటంలో జ‌గ‌న్‌…. మ‌ద్ద‌తు ఎవ‌రికి ఇస్తారో….?

11478
Congress Utilise Pranab Mukherjee to Speak YS Jagan for Support
Congress Utilise Pranab Mukherjee to Speak YS Jagan for Support

కేంద్రంలో హంగ్ ప్ర‌భుత్వం వ‌స్తుంద‌న్న సంకేతాల‌తో దేశ వ్యాప్తంగా రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. ఎవ‌రికి మెజారిటీ రాకుంటె ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏ, యూపీఏ కూట‌ములు ముంద‌స్తు వ్యూహాల‌కు పదును పెడుతున్నాయి. హంగ్ వ‌స్తే ప్ర‌భుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే ప్రధానం కానున్నాయి. ఇద‌లా ఉంటె దేశ రాజ‌కీయాల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్ హాట్ టాఫిక్‌గా మారాడు. జాతీయ పార్టీలు జ‌గ‌న్ మ‌ద్ద‌తుకోసం ఇప్ప‌టినుంచె ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టబోయేది ఆయన పార్టీయేనని పలు సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌ను మ‌చ్చిక చేసుకొనేందుకు కాంగ్రెస్ అధిష్టానం త‌న స్థాయిని త‌గ్గించుకొని జ‌గ‌న్ తో కాళ్ల బేరానికి వ‌చ్చింది. రెండు, మూడు రోజుల‌క్రితం కేరళ కాంగ్రెస్ ముఖ్యనేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే జ‌గ‌న్ మాత్రం ఎలాంటి భ‌రోసా ఇవ్వ‌లేద‌ని స‌మాచారం.

ఇక లాభం లేద‌నుకొని అధిష్టానం పార్టీలు సీనియ‌ర్ నేత త్రిబుల్ షూట‌ర్ అయిన మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీని రంగంలోకి దించుతోంది. అవసరమైతే సోనియానే స్వయంగా జగన్‌తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సారి ఎట్టిప‌రిస్తితుల్లోనూ భాజాపాను అధికారంలో రాకుండా అడ్డుకొనేందుకు హ‌స్తం పార్టీ తీవ్రంగా శ్ర‌మిస్తోంది.

మ‌రో వైపు భాజాపా కూడా వైసీపీతో ట‌చ్‌లో ఉంది. వైసీపీలో కీల‌కంగా వ్య‌వ‌హరిస్తున్న విజ‌య‌సాయిరెడ్డి క‌మ‌లం అధిష్టానంతో ప‌లుమార్లు చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోరాద‌నె అలోచ‌నలో ఉన్న‌ట్లు స‌మాచారం. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఎవ‌రు ఇస్తారో వారికే మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ పార్టీ ప్ర‌త్యేక‌హోదా ఇచ్చేందుకు సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించ‌గా…తాజాగా భాజాపా కూడా ప్ర‌త్యేక‌హోదా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత జ‌గ‌న్ ఎవ‌రికి మ‌ద్ద‌తిస్తారో చూడాలి.

Loading...