కేసిఆర్ కవిత మంత్రి పదవి ఇస్తే జరిగే పరిణామాలు ఇవే..

- Advertisement -

గతంలో చంద్రబాబు తన కొడుకును దొడ్డి దారిన మంత్రి గా చేసి ప్రజల నుంచి చాలా విమర్శలు ఎదుర్కున్నాడు.. ఎమెల్యే గా కూడా గెలవలేని లోకేష్ ని ఇలా మంత్రి పదవి ఇచ్చి ఆ పదవికి కళంకం తెచ్చారని అప్పటి ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి.. ఇప్పుడు అదే స్థాయిలో కేసీఆర్ విమర్శలు పొందేలా ఉన్నాడు.. అందుకు కారణం అయన కూతురు కల్వకుంట్ల కవిత అని తెలుస్తుంది..

ఆమె ఇటీవలే నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీ తో గెలిచిన సంగతి తెలిసిందే.. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆమె కోల్పోయిన దగ్గరే గెలిచి తన పంతం నెగ్గించుకుంది. పోలైన మొత్తం 823 ఓట్లలో 728 ఓట్లు కవితే దక్కాయి. కాంగ్రెస్, బీజేపీలకు కలిపి వంద ఓట్లు కూడా రాలేదు. టీఆర్ఎస్ అసలు బలం 505 మంది మాత్రమే. కానీ ఓట్లు మాత్రం 123 ఎక్కువ వచ్చాయి. దాంతో కవిత అక్కడ చేసిన పనితనం కనిపిస్తుంది.. ఓడిపోయినా కోపం ప్రదర్శించకుండా అక్కడి వారి తో ఆమె మంచి గా మెలిగి మళ్ళీ గెలుపు సాధించింది..

- Advertisement -

అయితే ఆమె గెలిచిన అనంతరం ఆమెకు మంత్రి పదవి ఇస్తున్నారని ఓ ప్రచారం ఊపందుకుంది. ఏకంగా హోం మంత్రినే చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఇప్పటికే కొంత వ్యతిరేకత కేసీఆర్ పై మొదలైంది.. ఈ దెబ్బతో ఆ వ్యతిరేకత  మరింత పెరగడం మాత్రం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ప్రస్తుతం హోమ్ మినిస్టర్ గా ఉన్న  మైనార్టీ వర్గానికి చెందిన మహమూద్ అలీని తొలగించి ఆ పదవి కవితకు ఇస్తే కేసీఆర్ కు అది మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఆర్టీసీ ఉద్యమం ద్వారా వచ్చిన వ్యతిరేకత, నిరుద్యోగుల నుంచి వచ్చిన వ్యతిరేకత.. లాంటి పెద్ద పెద్ద సమస్యల్నే కేసీఆర్ అధిగమించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా.. ఎన్నికల టైమ్ కి స్థానికతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోగల సమర్థుడు ఆయన. అలాంటిది ఈ చిన్న విషయాన్నీ కేసీఆర్ తనదైన శైలిలో డీల్ చేసి తన మాట నెగ్గించుకుంటాడని అంటున్నారు..

గట్టిగానే చెమటోడుస్తున్న హరీష్ రావు.. 

దుబ్బాక ప్రజలు.. మాట ఇస్తున్నారా..?

గారాలపట్టి కి మంత్రి పదవి ..?

దుబ్బాక లో ఎవరి బలం ఎంత..?

Most Popular

హీరోయిన్ రీమాసేన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

హీరోయిన్ రీమా సేన్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఎన్నో సినిమాల్లో నటించిన రీమా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. రమ్యకృష్ణ తర్వాత విలన్ రోల్ లో కూడా ఎంతో...

హీరో అబ్బాస్ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో తెలుసా ?

అబ్బాస్ అంటే తెలియని వ్యక్తి ఉండరు. చేసింది తక్కువ సినిమాలు అయిన మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో అబ్బాస్. ఇప్పటికి యాడ్స్ లో కనిపిస్తూ ఉంటాడు. టీవీ చూసే ప్రతి...

మా బ్యాటింగ్ చాలా దారుణంగా ఉంది.. ఏం చేయలేకపోయాం : ధోనీ

వరుస వైఫల్యం ఎదురుకావడం చాలా బాధగా ఉందని చెనై సూపర్ కింగ్స్ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. శుక్రవారం చెన్నైపై ముంబై ఇండియన్స్ 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది....

Related Articles

ఆ రైతులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్

వరి ధాన్యం కొనుగోలు కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర చెల్లించి, మక్కలు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. క్వింటాళుకు రూ.1,850...

కెసిఆర్ నిధులు బాగానే సంపాదించుకోస్తున్నాడే..

భారీవర్షాలు భాగ్య నగరాన్ని ఎలా ముంచెత్తాయి అందరికి తెలిసిందే.. వర్షాల దెబ్బకు సిటీ మొత్తం సముద్రంలా మారగా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.. నగరంలోని మూసి పరివాహక ప్రాంత వాసులు...

టీఆర్ఎస్ వ్యూహాన్ని మార్చే టైం వచ్చిందా..?

కేసీఆర్ ఏది చేసినా సంచలనమే.. తెలంగాణ తీసుకువచ్చే దగ్గరినుంచి నిన్నటి రెవెన్యూ చట్టంలో మార్పుల వరకు అన్ని కేసీఆర్ నిర్ణయాలు చరిత్ర ని తిరగరాసినవే అని చెప్పుకోవాలి.. మొదటి సారి...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...