Friday, March 29, 2024
- Advertisement -

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. అన్ని ఆసుపత్రిల్లో కరోనా ఉచిత చికిత్స..!

- Advertisement -

కరోనా వైరస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరితంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి ఎంతో మందిని బలితీసుకుంటుంది. డబ్బులేని వారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడుతున్న బాధలు రోజు సోషల్ మీడియాలో వీడియోల రూపంలో కనిపిస్తున్నాయి. ఏపీ తెలంగాణలో ఇప్పటికే చెరో 20వేల కేసుల చొప్పున పెరిగి పరిస్థితి దారుణంగా ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఏపీ సీఎం జగన్ గొప్ప మనసు చాటుకున్నాడు. ఆరోగ్యశ్రీలోకి కరోనా చికిత్సను తెచ్చాడు. ఇన్నాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రిల్లో మాత్రమే ఫ్రీ ఉండగా.. ఇప్పుడు ప్రైవేటు లోనూ ఏపీ ప్రజలు కరోనా చికిత్స తీసుకునేలా గొప్ప సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పుడీ నిర్ణయం జగన్ పై ప్రశంసలు కురిసేలా చేస్తోంది. ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా సోకిన వారితో పాటు కాంటాక్ట్ అయిన వారికి కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు. దీంతో అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా రోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్.జవహార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా చికిత్సకు అయ్యే ఖర్చుల వివరాలను కూడా ప్రకటించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఇక ఏపీ ప్రజలు కరోనా చికిత్సను ఉచితంగా చేసుకోవచ్చు.

ఈ మేరకు ప్రైవేట్ ఫీజులను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. నాన్ క్రిటికల్ కరోనా పేషెంట్ల వైద్యానికి రోజుకు రూ.3250 ఐసీయూలో వెంటిలేటర్ల వైద్యానికి రోజుకు రూ.5480 వెంటిలేటర్ వైద్యానికి రోజుకు రూ.9580 వెంటిలేటర్ లేకుండా వైద్యం చేస్తే రూ.6280గా ఖరారు చేసింది.దీంతో ఇక ఏపీలోని తమకు నచ్చిన మెరుగైన ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా ప్రజలు ఉచితంగా కరోనా చికిత్సను తీసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే.. రేషన్ కార్డు లేని కరోనా రోగులను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అంటే పేదలు ధనికులు అన్న తేడా లేకుండా అందరికీ ఉచిత కరోనా చికిత్స ఏపీలో సాధ్యమన్నమాట. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై నిజంగానే ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణలో కూడా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స అందించేలా కేసీఆర్ సర్కార్ చర్యలు తీసుకోవాలన్న తెలంగాణ ప్రజలు అంటున్నారు.

ఎవరికి తెలియని విషయాలు ఈ పుస్తకంలో ఉంటాయి : వైఎస్ షర్మిల

ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు.. దద్దరిల్లిన సోషల్ మీడియా..!

సీఎం జగన్ నిర్ణయంకు జనసైనికులు ఆనందం.. ఏంటి సంగతి ?

వైఎస్సార్ కు జగన్ నివాళులు.. భర్తపై పుస్తకం రాసిన వైఎస్ విజయమ్మ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -