Tuesday, April 23, 2024
- Advertisement -

జగన్‌కి జై కొట్టనున్న పురంధేశ్వరి….. త్వరలో వైకాపాలోకి……. బాబుకు చుక్కలే

- Advertisement -

వైఎస్‌ల బలాన్ని తట్టుకోలేక తెలుగువారిని కులాలుగా విడగొట్టే వికృత ప్రయత్నం చేశారు పచ్చ బ్యాచ్. అంతకుముందు ఎస్సీ, ఎస్టీలందరూ కాంగ్రెస్‌కి మద్దతుగా నిలబడ్డప్పుడు కూడా ఇలాంటి నీచ రాజకీయమే చేసి వాళ్ళలో విభేదాలు సృష్టించారు. అయితే ఇప్పుడు జగన్ మాత్రం తెలుగు నాట……..మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నాట బలంగా వేళ్ళూనుకుపోయిన ఆ కులజాఢ్యాన్ని తొలగించేదిశగా అడుగులేస్తున్నాడు. కొంత వరకూ ఓట్ల నష్టం జరిగే అవకాశం ఉంటుందన్న భయం ఉన్నప్పటికీ ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేస్తానని మాటిచ్చాడు. ఇక ఎస్సీ, ఎస్టీల మధ్య ఐక్యతకు కూడా కృషి చేస్తున్నాడు.

ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా అంటూ జగన్ చూపించిన రాజకీయ విజ్ఙత దెబ్బకు గింగిరాలు తిరుగుతున్న చంద్రబాబుకు ఇప్పుడు ఇంకో సూపర్ షాక్ ఇవ్వనున్నాడు జగన్. వైకాపాకు రాష్ట్రంలో అన్ని కులాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలూ మనస్ఫూర్తిగా మద్దతివ్వాలని కోరుకుంటున్న జగన్ ఇప్పుడు ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరిని పార్టీలో చేర్చుకోవడానికి రెడీ అయ్యాడు. పురంధేశ్వరిని విజయవాడ నుంచైనా, మచిలీపట్నం నుంచైనా పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టనున్నాడు జగన్. ఆ రకంగా ఎన్టీఆర్ అభిమానులను, కృష్ణా జిల్లాలో బలంగా ఉన్న ఒక కులం ప్రజల మనసులు గెలుచుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. బిజెపిలో ఉన్న నాయకులందరూ చంద్రబాబుకు సన్నిహితులే అయిన నేపథ్యంలో బిజెపిలో ఉన్న పురంధేశ్వరికి సరైన ప్రాధాన్యత దక్కకుండా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. అందుకే పురంధేశ్వరి కూడా చంద్రబాబు వ్యక్తిగత శతృవు అనే రేంజ్‌లో ఫీలవుతున్న జగన్‌తో చేయి కలిపి బాబును అష్టదిగ్బంధనం చేసేయాలి అనే స్థాయిలో ఆలోచిస్తున్నారట. రాష్ట్రంలో ఉన్న చాలా మంది నాయకులకంటే కాస్త తెలివితేటలు, ఇంగ్లీషు లాంటి భాషలపై పట్టు ఉన్న పురంధేశ్వరి ఆల్రెడీ నాలుగేళ్ళ చంద్రబాబు పాలనలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఉందన్న వార్తలు టిడిపి నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వైకాపాలో చేరి చంద్రబాబును టార్గెట్ చేస్తూ పురంధేశ్వరి యాక్టివ్ రోల్ ప్లే చేసిందంటే మాత్రం బాబు అండ్ కో డిఫెన్స్‌లో పడిపోవడం ఖాయం అన్నది విశ్లేషకుల మాట. అలాగే కుల సమీకరణాలు అన్నీ కూడా పూర్తిగా జగన్‌కి కలిసొచ్చే అవకాశం ఉందన్న భయం కూడా టిడిపి నాయకుల్లో వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -