వైసీపీలోకి గంటా.. డేట్ కూడా ఫిక్స్.. క్లారిటీ వచ్చేసింది..!

1372
date Fix To Ex Minister Ganta Srinivasa Rao Joins In Ysrpc
date Fix To Ex Minister Ganta Srinivasa Rao Joins In Ysrpc

ఏపీలో రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా వ్యవహారం అయితే మరింత రసవత్తరంగానే మారింది. ఆయన పార్టీ మారుతారని ఎప్పటికప్పుడు వార్తలు వస్తునే ఉన్నాయి. ఈ విషయంను ఆయన తోసిపుచ్చడం జరుగుతుంది. అయితే ఈ సారి వైసీపీలోకి గంటా వెళ్లడం మాత్రం ఖాయమన్న సమాచారం అందుతోంది.

అంతేకాకుండా ఆయన జగన్ పార్టీలో చేరేందుకు ముహుర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. వైసీపీలో చేరడానికి ఆయన ఏర్పాట్లు చేసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన చేరికపై ప్రచారం జరుగుతున్నా.. డేట్ పై క్లారిటీ లేదు. అయితే గంటా ముందుగా ఆగస్ట్ 15 పార్టీ మారాలనుకున్నారని.. ఆ తర్వాత 9న అన్న ప్రచారం కూడా జరిగింది.

అయితే వీటన్నిటిని పక్కన పెట్టి 16వ తేదీని ఫిక్స్ చేశారని సమాచారం. ఇక అదే రోజు సీఎం క్యాంపు ఆఫీస్ లో గంటాతో పాటు పలువురు టీడీపీ మాజీ నేతలు కూడా వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి వైసీపీ మద్దతుదారుడిగా గంటా కొనసాగగా, ఆయన వర్గానికి చెందిన నేతలు మాత్రం వైసీపీ కండువాలు కప్పుకుంటారని వార్తలు వెలువడుతున్నాయి. దాంతో ఏపీ రాజకీయాలు మరోసారి వాడివేడిగా మారుతున్నాయి. మరి ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబబు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇప్పటికే టీడీపీని వదిలేసి చాలా మంది నాయకులు వైసీపీలోకి వెళ్లారు. అయితే గంటా వైసీపీలో చేరే విశయమై.. జగన్ సన్నిహితులైన పలువురు నాయకులకు కూడా తెలియకుండా వ్యూహాలు రచించారని పొలిటికల్ టాక్ నడుస్తోంది. పార్టీలో తనకు అడ్డు ఉన్నావారిని దాటేసి మరి తన మ్యాటర్ ను గంటా జగన్ వరకు తీసుకెళ్లారని తెలుస్తోంది. మరి గంటా కోరికను జగన్ నేరవేరుస్తారో లేదో తెలియాలంటే.. కొన్ని రొజులు ఆగాల్సిందే.

చంద్రబాబు, లోకేశ్ కు షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీలు.. ?

బాలయ్య, పవన్ చేస్తే తప్పు లేదు.. నేను చేస్తే తప్పా ? : ఎమ్మెల్యే…

టీడీపీ వేర్లు కూడా పీకేసిన జగన్.. సరికొత్త చరిత్రను లిఖించాడు..!

టీడీపీకి అమరావతి.. వైసీపీకి విశాఖ.. మరి జనసేనకు ?

Loading...