Friday, April 19, 2024
- Advertisement -

వైఎస్ జగన్‌తో టచ్‌లోకి వచ్చిన జ్యోతుల నెహ్రూ…… టిడిపిలో చర్చ

- Advertisement -

టిడిపికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన వెంటనే టిడిపిలో ఉన్న కాపు నాయకులు అందరినీ పవన్ పైకి ఉసిగొల్పాడు చంద్రబాబు. మరీ ముఖ్యంగా తన లాంటి నిప్పు తర్వాత……దేశంలోనే ఆ స్థాయి నిప్పు నా తనయుడు నారా లోకేషే అని చంద్రబాబు కొడుకుని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. పచ్చ మీడియా సాయంతో లోకేష్‌ని జాకీలేసి లేపే ప్రయత్నం సంవత్సరాలుగా జరుగుతోంది. మంత్రి అవ్వకముందు నుంచే రాజ్యాంగేతర శక్తిగా మారి మొత్తం ప్రభుత్వాన్ని లోకేష్ శాసిస్తున్న వైనం గురించి , లోకేష్ అవినీతి గురించి పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలతో నారా వారి పరువు మొత్తం పోయింది. నాలుగేళ్ళుగా జనాలకు కూడా వినిపిస్తున్న మాటలే కావడం, ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు కూడా అంతర్గతంగా చర్చించుకుంటున్న విషయాలే కావడంతో ఎక్కువ మంది పవన్ మాటలను నమ్మేశారు. ఆ వెంటనే తనదైన స్టైల్‌లో తనతో సహా టిడిపి జనాలందరూ కూడా పవన్‌పై విరుచుకుపడేలా వ్యూహం రచించాడు చంద్రబాబు. మరీ ముఖ్యంగా కాపు నేతలందరూ పవన్‌ని తీవ్ర స్థాయిలో విమర్శించాలని అల్టిమేటం జారీ చేశాడు.

అయితే చంద్రబాబుకు ఈ విషయంలో ఊహించని షాక్ తగలిందని తెలుస్తోంది. వైకాపా నుంచి గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన జ్యోతుల నెహ్రూ టిడిపి అల్టిమేటంకు స్పందించలేదు. స్వయంగా చంద్రబాబే కాల్స్ చేసినప్పటికీ జ్యోతుల నెహ్రూ స్పందించలేదు. ఆల్రెడీ జ్యోతుల నెహ్రూ కుమారుడు వైఎస్ జగన్‌కి రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నాడు. జ్యోతుల నెహ్రూను వైఎస్ జగన్ శాసనసభలో వైకాపా ఉప నాయకుడిగా నియమించాడు. అంతటి ప్రాధాన్యతను ఇచ్చినప్పటికీ జ్యోతుల నెహ్రూ మాత్రం టిడిపి పెడుతున్న ఇబ్బందులతో పాటు ఆశ చూపిస్తున్న ఆర్థిక ప్యాకేజీకి కూడా ఆశపడి టిడిపిలోకి జంప్ అయ్యాడు. అయితే ఆ తర్వాత నుంచీ చంద్రబాబు తన మార్క్ రాజకీయాలు చూపించడం మొదలెట్టాడు. నియోజకవర్గంలో ఆల్రెడీ ఉన్న టిడిపి నేతలకు ప్రాధాన్యతనిస్తూ జ్యోతుల నెహ్రూ కుటుంబాన్ని అస్సలు పట్టించుకోవడం మానేశాడు చంద్రబాబు. తనతో పాటు తన కొడుక్కు కూడా టికెట్ ఇవ్వాలని జ్యోతుల నెహ్రూ పట్టుబడుతున్నాడు. ఆ విషయంపై ఎటూ తేల్చి చెప్పని చంద్రబాబు ఇప్పుడు జ్యోతుల నెహ్రూకి టికెట్ ఇచ్చే విషయంపై కూడా గ్యారెంటీ ఇవ్వడంలేదు.

ఈ మొత్తం వ్యవహారం సీనియర్ నాయకుడు అయిన జ్యోతుల నెహ్రూని ఇరిటేట్ చేస్తోంది. పార్టీలో చేరక ముందు వరకూ అమిత ప్రాధాన్యం ఇచ్చి…..ఎన్నో ఆశలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా వదిలేసిన వైనంపై నెహ్రూ వర్గం గుర్రుగా ఉంది. అందుకే పవన్‌ని తిట్టమని చెప్పి చంద్రబాబు కాల్స్ చేస్తే జ్యోతుల నెహ్రూ కనీసం పట్టించుకోలేదట. అంతే కాకుండా తన కొడుకు ద్వారా వైఎస్ జగన్‌తో రాయబారం నడుపుతున్నాడు నెహ్రూ. మళ్ళీ జన్మలో తప్పు చేయనని, జీవితాంతం వైసిపీలోనే ఉంటానని జగన్‌కి మాట ఇస్తున్నాడు నెహ్రూ. నెహ్రూ వర్గం అంతా కూడా ఎలా అయినా మళ్ళీ జగన్ పార్టీలోనే చేరమని నెహ్రూపై ఒత్తిడి తెస్తున్నారు. వైఎస్ జగన్ స్పందన ఏంటి అనేది ఇంకా తెలియలేదు. అయితే వైఎస్ జగన్ యస్ అంటే మాత్రం జ్యోతుల నెహ్రూ కుటుంబం మొత్తం వైకాపాలో చేరడం ఖాయం అన్నది టిడిపి నేతలే అంతర్గతంగా చర్చింకుంటున్న విషయం. ఈ నేపథ్యంలోనే జ్యోతుల నెహ్రూని బుజ్జగించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు చంద్రబాబు. ముందు ముందు పరిణామాలు ఎలా చోటు చేసుకుంటాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -