Wednesday, April 24, 2024
- Advertisement -

రాజ‌కీయాల్లో కాసింత ఓపిక‌, స‌హ‌నం ఉండాల‌ప్పా…

- Advertisement -

రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన త‌ర్వాత ఓపిక‌,స‌హ‌నం అవ‌స‌రం. పార్టీ అధ్య‌క్షుడైతె ఇంకా చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌వ‌ర్‌లో ఉన్న పొలిటీషియ‌న్‌కె ముందుగా ప్ర‌యారిటీ ఇస్తార‌నేది వాస్త‌వం. ఎంత అభిమాన నాయ‌కుడైనా ….పొలిటిక‌ల్ ప‌వ‌ర్ ముందు త‌గ్గ‌క త‌ప్ప‌దు. అందులోను సీఎం వ‌స్తున్నారంటె ప్రోటోకాల్ త‌ప్పని స‌రిగా పాటించాలి. అది కూడా ప‌వ‌న్‌కు తెలియ‌దా అనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు అంటూ సినిమాల్లో డైలాగ్స్ చెప్పే పవన్.. నిజ జీవితంలో ఆ పరిస్థితి ఎదురయ్యేసరికి మాత్రం కొంచెంఫీల్ అయ్యారట. అందుకే కారు కూడా దిగకుండానే వచ్చిన దారిలో వచ్చినట్లే మళ్లీ వెనక్కి వెళ్లిపోయాడట.

అస‌లు విష‌యానికి వ‌స్తె ఎన్టీవి ఛైర్మన్ నరేంద్ర చౌదరి కూతురి వివాహానికి చాలామంది వివిఐపీలు వచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. సీఎం కాన్వాయ్ వస్తుందంటే సహజంగానే ఇతరుల వాహనాలను నిలిపివేయడం కామన్. అందులోను సీఎం కేసీఆర్ కాన్వాయ్ దేశంలోనే అందరు సీఎంల కన్నా పెద్దది. దీంతో ప్రోటోకాల్ ప్రకారం ఆ దారిలో వచ్చే కార్లన్నింటిని ఆపేశారు. దీంతో వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత  ప‌వ‌న్‌ కూడా వాహనాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది.

కేసీఆర్ కాన్వాయ్ వస్తుండటంతో పవన్ కారు కూడా రోడ్డుపై నిలిచిపోక తప్పలేదు. అయితే పవన్ మాత్రం దీన్ని ఇబ్బందికి ఫీలయ్యారట. ఒకింత అలిగిన పవన్.. అదే దారిలో తిరిగి వెళ్లిపోయారని చెబుతున్నారు. పెళ్లిచూడ‌టానికి వచ్చిన పవన్.. పెళ్లి మంటపంలోకి కూడా రాకుండానే వెనుదిరిగారట

పవన్ అలిగి వెనక్కి వెళ్లిపోతే.. జగన్ మాత్రం హుందాగా వ్యవహరించారని చెబుతున్నారు. కేసీఆర్ కాన్వాయ్ వెళ్లేవరకు వేచి చూసి.. ఆపై ఆయన పెళ్లి వేదిక వద్దకు వెళ్లారు. సీఎం హంగామా ముగిసిన తర్వాతే వెళ్లడం బెటర్ జగన్ కూడా భావించి ఉండవచ్చు. అలా కేసీఆర్ తర్వాత పెళ్లి మంటపంలోకి వచ్చిన జగన్‌కు అతిథి మర్యాదలు బాగానే దక్కాయి.

ఇలాంటి వాటిని ఇంతగా ఎందుకుపట్టించుకోవాలి? అని ప్రశ్నిస్తున్నారు. సీఎం స్థాయి వ్యక్తి వస్తున్నప్పుడు కాసేపయినా వేచి చూసే ఓపిక లేకపోతే ఎలా అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. రాజ‌కీయాల్లో ఓపిక‌,స‌హ‌నం లేక‌పోతె ఎలా. ప‌వ‌న్‌కు, జ‌గ‌న్‌కు తేడా అదేన‌ని అభిమానులు అనుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -