Friday, March 29, 2024
- Advertisement -

బీజేపి తో పవన్ తెగదెంపులు చేసుకున్నట్లేనా..!!

- Advertisement -

జగన్ రాజధానుల నిర్ణయం రాష్ట్రంలో ఎన్ని ప్రకంపనలు సృష్టించాయో అందరికి తెలిసిందే.. ఒక్కసారిగా పన్ని పార్టీ నేతలు ఉలిక్కి పడగా, ఎదో కొంపలు కూలిపోతున్నట్లు దానిపై అమరావతి లో ఉద్యమాలు చేశారు.. ప్రజలను మోసం చేసి భూములు లాక్కుంది కాకుండా వారికోసం ఎదో మంచి చేస్తున్నట్లు అమరావతి ప్రజలతో చేరి ముసుగులో నాటకమాడరు..అంతేకాదు అక్కడ రాజధాని లేకపోవడం వల్ల తమ ప్రయోజనాలు దెబ్బతింటాయి చెప్పి వారు ఆడుతున్న ఈ గేమ్ లో ప్రజలను చేర్చుకుని వారిని పావులుగా వాడుకున్నారు.. ఎలాగైతేనేం ప్రజాభిష్టం మేర రాష్ట్రంలో ఒక్క రాజధాని కాస్త మూడు రాజధానులుగా విభజించబడింది..

ఇక దీనిపై కోర్టు ఇటీవలే అన్ని పార్టీ లు తమ అఫిడవిట్లు దాఖలు చేయాలని కోరగా ఒక్కో పార్టీ తమ అభిప్రాయాన్ని వెల్లబుచ్చాయి. ఈ కోవలో జనసేన ఆసక్తి కర నిర్ణయం తీసుకుంది. పవన్ కళ్యాణ్ బిజెపి కి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు ఏమవుతుందో అని అందరు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.. రాజధాని విషయంలో అమరావతి రైతులకు అండగా ఉంటామన్నారు. అంతవరకూ బాగానే ఉన్నారు. అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా హైకోర్టులో కౌంటర్ వేయడానికి పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు.

ఇది రెండు పార్టీల పరస్పర విరుద్ధమైన నిర్ణయాలు. బీజేపీ దారిలో వెళితే తమకు ఇబ్బంది ఎదురవుతుందని భావించిన జనసేన అధినేత అమరావతి వైపే నిలబడాలని నిర్ణయించుకున్నారు.  దాంతో ఈ రెండు పార్టీ ల మధ్య స్నేహం చెడేలా ఉంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఉన్నంత వరకూ రాజధాని అమరావతిపై పోరాటం చేశారు. రాజధాని కోసం ఉద్దండరాయుని పాలెంలో దీక్ష కూడా చేశారు. అప్పుడే జనసేన, బీజేపీల మధ్య పొత్తు కుదిరింది. ఇద్దరూ కలసి రాజధాని అమరావతి రైతుల కోసం లాంగ్ మార్చ్ చేస్తామని ఢిల్లీలో ఆర్భాటంగా ప్రకటించారు. కానీ పార్టీ కేంద్ర నాయకత్వం వత్తిడితో అది నిరవధికంగా వాయిదా పడింది. ఏదేమైనా ఒకటైన రెండు పార్టీ కొన్ని నెలల్లోనే ఇలా అభిప్రాయ భేదాలు మొదలవుతాయనుకోలేదు.. మరీ దీనికారణం ఎన్ని పరిణామాలు చూడాల్సి వస్తుందో చూడాలి మరీ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -