Thursday, April 25, 2024
- Advertisement -

బ్రేకింగ్: తెలంగాణ బీజేపీ ఎంపీ పోస్టు ఊస్టేనా?

- Advertisement -

తెలంగాణలో బీజేపీ నుంచి గెలిచిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చిక్కుల్లో పడ్డారు. ఆయన ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించారనే ఆరోపణలతో తన పదవి నుంచి అనర్హతను ఎదుర్కొంటున్నారు.

గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూతురు కవితను ఓడించి నిజామాబాద్ ఎంపీగా అరవింద్ సంచలన విజయం సాధించారు. కవితనే రాజకీయాల్లో యాక్టివ్ లేకుండా చేశాడు. అలాంటి ధర్మపురి అరవింద్ ఇప్పుడు విద్యార్థత విషయంలో తప్పుగా ఎన్నికల సంఘానికి సమర్పించడంతో ఇప్పుడు ఆ కేసుల్లో ఇరుక్కున్నారు.

ధర్మపురి అరవింద్ రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని జనర్ధాన్ రాయ్ నగర్లోని రాజస్థాన్ విద్యాపీఠం నుంచి పొలిటికల్ సైన్స్ లో పోస్టు గ్రాడ్యుయేట్ చదివినట్టు ధర్మపురి అరవింద్ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయం నుంచి 2018లో సూదూర రీతిలో ఉత్తీర్ణుడయ్యానని అఫిడవిట్ లో పేర్కొన్నారు.

అయితే తాజాగా ఈ విషయాన్ని రాబట్టాడు టీఆర్ఎస్ నాయకుడు మన్ను క్రిశాంక్. ఈయన కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యానారాయణ అల్లుడు. ఆర్టీఐ ద్వారా అరవింద్ చదివిన విశ్వవిద్యాలయంలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాడా అని ఆరాతీయగా.. చదవలేదని తేలింది. అసలు విద్యార్థిగా తమ విశ్వవిద్యాలయంలోనే నమోదు కాలని క్రిశాంక్ కు ఆర్టీఏలో సమాధానం వచ్చింది.

దీంతో బీజేపీ అరవింద్ పై ఈసీ చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నాయకుడు సతీష్ రెడ్డి ఎన్నికల సంఘంతోపాటు ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే అరవింద్ తప్పుడు ధృవపత్రాలు దాఖలు చేసిన కారణంగా ఎంపీగా అనర్హత వేటు పడే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -