Thursday, April 25, 2024
- Advertisement -

ఇలాంటి నేత‌ల‌ను న‌మ్ముకుంటే పార్టీకీ న‌ష్టం త‌ప్ప‌దా…?

- Advertisement -

రాజకీయాల్లో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు స‌ర్వ‌సాధార‌ణం. ప్ర‌స్తుతం విమ‌ర్శ‌ల‌కు అర్థం ప‌ర్థం లేకుండా
శృతిమించిపోతున్నాయి. విమ‌ర్శ‌లు కూడా విమ‌ర్శ‌నాత్మ‌కంగా, అంద‌రూ మెచ్చేలా ఉండాలి గాని…పార్టీకీ చేటు చేసేవిధంగా ఉండ‌కూడ‌దు.  అలాంటి విమ‌ర్శ‌లే ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీల‌కు తీవ్ర న‌ష్టాన్ని
మిగుల్చుతాయి. ప్ర‌తిప‌క్ష పార్టీ అయితే మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలి.

తెలంగాణాలో ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు చేసిన
అతి విమ‌ర్శ‌లే ఆ పార్టీ ఘోరంగా ఓట‌మిని చ‌విచూసింది.  అ లాంటి ప‌రిస్థితే ఇప్పుడు వైసీపీలో ఉందనే వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌జాస‌మ‌స్య‌ల విష‌యంలో ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే హ‌క్కు ప్ర‌తిప‌క్షానికుంది. కాని వైసీపీలో దాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దాని వ‌ల్ల వైసీపీ మీద ప్ర‌జ‌ల్లో విశ్వసనీయత త‌గ్గుతుంది.

ప్ర‌స్తుతం విజ‌య‌సాయి రెడ్డి తీరు అలానే ఉంద‌నే విమ‌ర్శ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. తాజాగా పెథాయ్ తుఫాన్ విషయంలో బాబును ప‌ర్స‌న‌ల్‌గా టార్గెట్ చేశారు. చంద్రబాబుకు కారు డాష్ బోర్డుకు, కంప్యూటర్ డేష్ బోర్డుకు తేడా తెలియదని సెటైర్లు వేశారు. చంద్రబాబు చెప్పేవాటికి ,చేసేవాటికి సంబంధం ఉండదన్నారు. అంతా ప్రచారం తప్ప డేష్ బోర్డులో ఏమి ఉంటుందో తెలియదని విజయసాయి అంటున్నారు.

బాబుకు ప్ర‌చార యావ ఎక్కువ‌ని అంద‌రికీ తెలిసిందే. సొంత డ‌బ్బా కొట్టుకోవ‌డంలో బాబును మించిన వారెవ‌రూ లేరు. అధికార ప‌క్షాన్ని నిల‌దీయ‌డంలో లాజిక్ ఉండాలి. అసలు చంద్రబాబుకు కారు డ్యాష్ బోర్డ్కు, కంప్యూటర్ డ్యాష్ బోర్డుకు తేడా తెలియదని మాట్లాడితే ఎవరైనా నమ్ముతారా..?

ఇలాంటి విమర్శల వల్ల.. అసలు సమస్యలు వచ్చినప్పుడు విమర్సించినా జనం కూడా పెద్దగా పట్టించుకోరు. అప్పుడు పార్టీకే న‌ష్టం జ‌రుగుతుంది. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ట్యాంపరింగ్ ద్వారానే వైఎస్సార్‌పీసీ కంటే 5 లక్షల ఓట్లు ఎక్కువ రాబట్టుకుని అధికారంలోకి వచ్చారన్నారు. ఇలాంటి డొల్ల వాదనలు చేసే నేతలలను నమ్ముకుంటే.. 2019లో జగన్ పుట్టి మ‌రో సారి మున‌గ‌డం త‌ప్ప‌దా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -