Thursday, April 25, 2024
- Advertisement -

బాబు బుజ్జగించినా వినని టీడీపీ మాజీ మంత్రి …రేపు భాజాపాలో చేరిక

- Advertisement -

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో బాబుకు రోజుకొక షాక్ తగులుతోంది. కేవలం 23 సీట్లు మాత్రమే సాధించడంతో ఆ పార్టీకి భవిష్యత్తు లేదని కీలక నేతలంతా ఇతర పార్టీల్లో చేరుతున్నారు. వైసీపీ అధికారంలో వచ్చినప్పటినుంచి అనేకమంది టీడీపీ పెద్ద తలకాయలు ప్రధానంగా భాజాపాలో చేరారు. కడప జిల్లాలో జగన్ ను దెబ్బకొట్టాలని చూసిన బాబుకు ఇప్పుడు ఆ జిల్లాలో టీడీపీ ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్.. ఇదివరకే టీడీపీని వీడారు. కేంద్ర మాజీమంత్రి, తోటి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో కలిసి ఆయన కాషాయ కండువాను కప్పుకొన్నారు. పెద్ద పెద్ద బడా నేతలంతా జంప్ అవుతున్నారు.ఇప్పుడు ఇంకా మిగిలిన నేతలు కూడా అదే పార్టీలోకి జంప్ అవ్వకుండా చంద్రబాబు ఏదో ప్రయత్నాలు జరుపుతున్నా సరే అవి పెద్దగా పని చెయ్యట్లేదు.

ఇదిలా ఉండగా చంద్రబాబుకు మరో షాక్ తగిలిందని వార్తలొస్తున్నాయి.టీడీపీ కు చెందిన మీరో కీలక నేత అయినటువంటి ఆది నారాయణ రెడ్డి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వీడనున్నట్టు తెలుస్తుంది.దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు.గురువారం ఆయన దేశ రాజధానిలో బీజేపీ తాత్కాలిక అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు. దీనికోసం ఆయన బుధవారం రాత్రే న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆదినారాయణ రెడ్డితో పాటు ఆయన క్యాడర్ మొత్తం టీడీపీని వీడటానికి సిద్ధపడ్డారు.మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

మరో సీనియర్ నేత రామసుబ్బారెడ్డి సైతం పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో జమ్మలమడుగు స్థానాన్ని వైసీపీ కౌవసం చేసుకోవడంతో రామసుబ్బారెడ్డి ఆటలు సాగలేదు. ముందునుంచి ఆది కుటుంబంతో వైరం ఉన్న రామసుబ్బారెడ్డి బాబు మాటకు విలువ ఇస్తూ ఆయనతో కలసి పనిచేశారు. ఇప్పుడు ఆది భాజాపాలో చేరడంతో ఇక టీడీపీలో ఉండి భవిష్యత్ ను నాశనం చేసుకొనేదానికంటె వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. వీరిద్దరు టీడీపీని వీడటంతో దాదాపు ఆ పార్టీ కడప జిల్లాలో ఖాలీ అయినట్లే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -