Tuesday, April 23, 2024
- Advertisement -

గోదావరి జిల్లా టిడిపిలో ప్రకంపనలు….. వైకాపాలోకి బాబు అత్యంత సన్నిహితుడు

- Advertisement -

గోదావరి జిల్లాల్లో జగన్ అడిగిడిగిన రోజే చంద్రబాబుకు సూపర్ షాక్ తగిలింది. రెండున్నర దశాబ్ధాల పాటు బాబుకు అత్యంత సన్నిహిత నాయకుడిగా ఉన్న టిడిపి నాయకుడు జగన్ పార్టీలో చేరడం ఖాయం అయింది. ఇప్పుడు ఈ వార్తనే టిడిపిలో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటి వరకూ టిడిపి నుంచి వైకాపాలోకి చాలా మంది నాయకులే వచ్చారు. కానీ టిడిపి నుంచి వైకాపాలో చేరబోయే నాయకుడిగా తాజాగా వినిపిస్తున్న పేరు మాత్రం నారా వారిలో ఆందోళన పెంచేదే. చంద్రబాబుకు అత్యంత సన్నిహిత నాయకుడిగా రెండు దశాబ్ధాలు కొనసాగిన చరిత్ర ఆ నాయకుడిది.

పశ్ఛిమ గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ టిడిపి నాయకుడు బొడ్డు భాస్కర రామారావు టిడిపి వీడాలని నిర్ణయించుకున్నారు. పెద్దాపురం సీటు విషయంలో చంద్రబాబు రాజకీయాలు తట్టుకోలేకే టిడిపిని వీడుతున్నాడని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప కూడా 2019 ఎన్నికల్లో పెద్దాపురం నుంచే పోటీ చేయాలనుకుంటున్నాడు. ఆ విషయాన్ని బహిరంగంగానే చెప్తున్న చినరాజప్ప…….బొడ్డు భాస్కర రామారావును తన శతృవు అని చెప్తున్నాడు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం చినరాజప్ప, బొడ్డు భాస్కరరామారావులతో రాజకీయం చేస్తూ ఇద్దరిలో ఎవరికి సీటు ఇస్తాడో చెప్పకుండా మేనేజ్ చేస్తున్నాడు. చంద్రబాబు రాజకీయ డ్రామాలు ఎలా ఉంటాయో బాగా అవగాహన ఉన్న బొడ్డు భాస్కరరామారావు తాజాగా తన సన్నిహితులతో సమావేశం పెట్టుకున్నాడు. చంద్రబాబు రాజకీయాలను అస్సలు నమ్మలేమని…..వైకాపాలోకి వెళ్ళడమే మంచిదని ఆయన సన్నిహితులు అభిప్రాయపడడంతో ఈ మాజీ ఎమ్మెల్సీ, చంద్రబాబు సన్నిహితుడు అయిన నాయకుడు ఇప్పుడు వైకాపా నాయకులకు టచ్‌లోకి వెళ్ళాడట. జగన్ కనుక పెద్దాపురం సీటు కన్ఫాం చేస్తే మాత్రం వెంటనే వైకాపాలో చేరడానికి రెడీ అన్న సంకేతాలు వైకాపా నాయకుడు బొత్స సత్యనారాయణకు ఇచ్చాడని తెలుస్తోంది. ఇక ఈ టిడిపి నాయకుడి చేరిక విషయంలో జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి. ఏది ఏమైనా ఏణ్ణర్థం క్రితమే ఎన్నికల ఏడాదిలో చంద్రబాబుకు అసలు సినిమా కనపడుతుంది అని జగన్ చెప్పినట్టుగానే చంద్రబాబు సన్నిహితులతో సహా టిడిపి నాయకులు చాలా మంది చంద్రబాబు రాజకీయ డ్రామాలకు భయపడుతూ, చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తాడు అన్న నమ్మకం అస్సలు కుదరక వరుసగా వైకాపాలోకి జంప్ చేస్తూ ఉండడం మాత్రం టిడిపి నాయకులు, శ్రేణులను కలవరపెడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -