Thursday, April 25, 2024
- Advertisement -

ఇది విన్నారా….! జ‌న‌సేన 88 సీట్లు గెలుస్తుంద‌ట…

- Advertisement -


కంద‌గ‌డ్డ‌కు లేని దురుద క‌త్తిపీట‌కు ఎందుక‌న్న‌ట్లు ఉంది విశాఖ జ‌న‌సేన ఎంపీ అభ్య‌ర్థి మాజీ సీబీఐ జేడీ ల‌క్ష్మినారాయ‌ణ ప‌రిస్థితి. ఈనెల 11న జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ అడ్ర‌స్ గ‌ల్లంత‌య్యింది. అది కూడా ఎక్క‌డి క‌క్క‌డ జ‌న‌సేన పార్టీ ఆఫీసుల‌న‌కు టూ లెట్ బ‌రోర్డులుకూడా ద‌ర్శ‌నిస్తుంటె ల‌క్ష్మినారాయ‌ణ మాత్రం కామెడీ జోకులు పేల్చుతున్నారు. నిన్న కాక మొన్న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ల‌క్ష్మీనారాయ‌ణ మాటు వింటుంటే ఆయ‌న పూర్తిగా పొలిటీషియ‌న్ లా మారిపోయిన‌ట్లు క‌నిపిస్తోంది.

అస‌లు విష‌యానికి వ‌స్తె రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా పోటీ వైసీపీ, టీడీపీ మ‌ధ్య‌నే జ‌రిగింద‌న్న‌ది వాస్త‌వం.అన్ని స‌ర్వేలు కూడా వైసీపీ అధికారంలోకి వైసీపీ వ‌స్తుంద‌ని ప్ర‌తిప‌క్ష పార్టీగా టీడీపీకి ప‌రిమితం అవుతుంద‌ని కోడై కూస్తుంటె జ‌న‌సేన పార్టీ మాత్రం మేము అధికారంలోకి వ‌స్తామ‌ని ప్ర‌క‌టించ‌డం హ‌స్యాస్ప‌దంగా ఉంది.

మ‌రో వైపు రాజ‌కీయ విశ్లేష‌కులు మాత్రం అధికార తెలుగుదేశం, ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్యే అధికారం కోసం పోరు ఉంటుంది త‌ప్పించి మ‌రే పార్టీకి ఆ అవ‌కాశం లేదంటున్నారు. అయితే, జ‌న‌సేన పార్టీ నేత‌, మాజీ జేడీ లక్ష్మీ నారాయణ మాత్రం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌దే అధికార‌మని, 88 సీట్లు వ‌స్తాయ‌ని వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

పోలింగ్ పూర్త‌యిన త‌ర్వాత జ‌గ‌న్‌, బాబు ప్రెస్ మీట్లు పెట్టి ఊద‌ర‌గొట్టేస్తుంటె….జ‌న‌సేన అధ్య‌క్షుడు మాత్రం అజ్ణాతంలోకి వెల్లిపోయారు. పోలింగ్ స‌ర‌ళి, జ‌న‌సేన‌కు ఎన్ని సీట్లు వ‌స్తాయ‌నేది ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌నే ప్ర‌క‌టించ‌లేదు. అలాంటిది ల‌క్ష్మినారాయ‌ణ మాత్రం 88 సీట్లు వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించ‌డం చూస్తే పూర్తిగా బాబులాగా మారిపోయిన‌ట్లు తెలుస్తోంది. పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్‌కే లేని దుర‌ద ఈయ‌న‌కెందుకో…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -