Thursday, March 28, 2024
- Advertisement -

జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి..!

- Advertisement -

ఏపీ సీఎం జగన్ కు ఓ లేఖ రాశానని.. కానీ దాన్ని ఈ జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన విషయాలను ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. తాను ఇళ్ల స్థాలాల పై కొన్న ఆవ భూములపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు. వాటికి చాలా అధిక ధరకు కొనుగోలు చేశారని.. అయితే వాటికి అంత పెద్ద మొత్తంలో ధర లేదని ఉండవల్లి అన్నారు.

అవినీతి రహిత పారిపాలన అందిస్తానని చెప్పి.. అధికారంలోకి వచ్చిన జగన్.. మరి భూమల విషయంలో ఎందుకని ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఉండవల్లి నిలదీశారు. ఇది జగన్ సర్కార్ అసమర్థత అని, ఎక్కువ ధరకు భూములు కొని.. ఇళ్ళ పట్టాలు ఇవ్వడం సరికాదని అన్నారు. ఇసుక విధానంపై ఏపీ ప్రభుత్వంకు సరైన ప్రణాళిక.. ముందు అంచానా లేదని అన్నారు. దీనివల్ల ఏపీ నిర్మాణ రంగం చాలా వరకు క్షీణించిపోతుందని అన్నారు. ఇసుక కష్టాలు ఇంతవరకు తీర్చలేకపోయారని చెప్పారు.

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక అందుబాటులో లేదని.. ఇసుక విధానంలో అవినీతి జరగడం మాత్రమే కాకుండా కూలీలకు ఉపాధి లేకుండా పోతుందని అన్నారు. అదేవిధంగా మద్యంపై త్వరలోనే పలు విషయాలు తేల్చి చెబుతానని ఉందవల్లి చెప్పారు. ఏపీలో మద్యం ధరలు పక్క రాష్ట్రం కంటే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ధరలు పెంచడం వల్ల తాగేవారి సఖ్య తగ్గుతుందని అనుకోవడం భ్రమేనని అన్నారు. అదేవిధంగా రాజకీయ ప్రత్యర్ధులపై వైఎస్‍ఆర్సీపీ ప్రతీకార చర్యలకు పాల్పడుందని.. ఇది సరికాదని అన్నారు.

ప్రభుత్వ అధికారులు, ఎలక్షన్ కమిషన్‌ విషయంలో వచ్చిన తీర్పుల విషయంలో న్యాయమూర్తులపై వైసీపీ నేతలు చేస్తోన్న కామెంట్స్ సరికాదని ఆయన చెప్పారు. న్యాయమూర్తుల గురించి సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడం అనేది సిగ్గుమాలిన చర్య అన్నారు. ఇక నిమ్మగడ్డ రమేశ్ విషయంలో జగన్‌ ఎందుకు అభద్రతా భావంతో ఉన్నారని ఉండవల్లి ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చింది పగలు తీర్చుకోవడానికి కాదని హితవు పలికారు. ప్రజలకు రూ.80,500 కోట్లు పంచుతామని ప్రభుత్వం అంటోంది. మరి ఎక్కణ్నుంచి అంత డబ్బు తెచ్చి ఇస్తారని ఆయన ప్రశ్నించారు.

ఏపీ బడ్జెట్‌ ప్రధాన అంశాలు ఇవే.. ఏ రంగానికి ఎంతంటే ?

ఏపీ నుంచి కొత్త రాజ్యసభ సభ్యులు వీరే..!

వేదాద్రి రోడ్డు ప్రమాదంలో మృతులకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా : సీఎం జగన్‌

దేశం కోసం అండగా ఉంటాం.. ప్రధానితో సీఎం జగన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -