పార్టీ మార‌డంపై స్పందించిన మాజీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి…

346
Ex tdp minister Adinarayana reddy responded to joining BJP
Ex tdp minister Adinarayana reddy responded to joining BJP

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓట‌మి షాక్ నుంచి బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నారు. సాక్షాత్తు చంద్ర‌బాబె ఓట‌మికి కార‌ణాలు తెలియ‌డం లేద‌ని చేసిన వ్యాఖ్య‌లు చూస్తె ఆ పార్టీ ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇద‌లా ఉంటె కొంద‌రు నేత‌లు భాజాపా లోకి వెల్తున్నార‌నె వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. వారిలో ప్ర‌ధానంగా మాజీ మంత్రి ఆదానారాయ‌ణ రెడ్డి క‌మ‌లం గూటికి చేరుతున్నార‌నె వార్త‌ల‌పై స్పందించారు. తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. టీడీపీని ఎట్టి పరిస్థితుల్లో వీడనని స్పష్టం చేశారు.

రామసుబ్బారెడ్డి, తాను కలిసినప్పటికీ తమ పార్టీ ఓడిపోవడం వెనుక బలమైన కారణాలు ఏవో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. తమ కలయిక వల్ల ఇబ్బంది తలెత్తుతుందని కొందరు భావించారని అనుమానపడ్డారు. ఓట‌మి వెనుక ఏవో బ‌ల‌మైన కార‌నాలు ఉన్నాయ‌న్నారు. వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని విమర్శించిన ఆదినారాయణరెడ్డి, టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని, తమ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు.

Loading...