Wednesday, April 24, 2024
- Advertisement -

జగన్‌కు వందకు 110 మార్కులు…జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించి వంద రోజులు పూర్తయ్యింది.వందరోజుల పాలనలో అవినీతికి తావు లేకుండా సంచలన నిర్ణయాలు తీసుుకన్నారు.ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హీమీలను జగన్ నెరవేర్చడంతోపాటు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. జగన్ పాలనపై ప్రజలతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా జేజేలు పలుకుతున్నారు.

సీఎం జగన్ నిర్ణయాలు, పాలనపై మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్ వంద రోజుల పాలనకు 100 మార్కులు పడాల్సిందేనన్నారు.ఇంకా ఎక్కువ మాట్లాడితే వందకు 110 మార్కులు ఇవ్వాల్సిందే. జగన్ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మావాడే.. అంతేకాదు మావాడు చాలా తెలివైనవాడు’అంటూ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జగన్ కిందా మీదా పడుతున్నాడు. ఆయనను చేయిపట్టి నడిపించేవారు దొరకలేదు. ఒకవేళ మమ్మల్ని అడిగితే వెళతా. పిలవకుండా వెళితే.. ఎవరు రమ్మన్నారంటారు. అయినా మమ్మల్ని ఎవరు రానిస్తారన్నారు. రాజధాని ఇక్కడే ఉంటుంది.. ఎక్కడికీ తరలిపోదనే అభిప్రాయాన్ని జేసీ వ్యక్తం చేశారు. ఒకవేళ జగన్ అడిగితే సలహాలు ఇస్తానన్నారు.

జగన్‌కు మంచి జరగాలి. రాష్ట్రానికి మంచి జరగాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల సర్కారుపై భారం పడుతుంది. విలీనం వల్ల కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. రివర్స్ టెండరింగ్‌లో కొన్ని లోపాలున్నాయి.’ అని జేసీ దివాకర్ రెడ్డి సుతిమెత్తగా విమర్శలు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -