Friday, April 19, 2024
- Advertisement -

జగన్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎంపీ జేసీ….

- Advertisement -

కొద్ది రోజులుగా సైటెంట్ గా ఉన్న టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వైఎస్ జగన్ ప్రభుత్వంపై మరో సారి నోరు పారేసుకుంటున్నారు. పార్టీ ఓటమిపై టీడీపీ విస్త్రుత స్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆరు నెలలు కార్యకర్తలు ఓపిక పట్టాలని ….జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా ఉన్నాయని ప్రజల్లో వ్యతిరేక వస్తుందన్నారు.జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు మూర్ఖంగా ఉన్నాయని ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని జోష్యం చెప్పారు. మూడేళ్లలో ఎన్నికలు వస్తాయని కొందరు నేతలు చెబుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పోలవరం ప్రాజెక్టుపై రివర్స్ టెండరింగ్ కు వెల్లడం జగన్ కు సరికాదని అభిప్రాయపడ్డారు. బాబు అపరచాణుక్యుడని ప్రధాని మోదికి బాబు అవసరం పడిందని చిలక జోష్యం చెప్పారు. ఇప్పటి వరకు ఎడ మొహం పెడ మొహంగా ఉన్నారని.. పరిస్థితి మారిపోతుందన్నారు. పార్టీ కార్యకర్తలు అధైర్యపడొద్దని ధైర్యంగా ఉండాలన్నారు.ఆరు నెలలు ఓపిక పట్టాలని.. రెండున్నరేళ్లలో ఎన్నికలు వస్తాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -