Thursday, April 25, 2024
- Advertisement -

ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు.. దద్దరిల్లిన సోషల్ మీడియా..!

- Advertisement -

తెలుగు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో అభిమనులు నివాళిలు అరిపిస్తున్నారు. ఆయన జీవిత ప్రయాణం గురించి ఆద్యా మీడియా ప్రత్యేక కథనం..

చెదిరిపోని గుండెబలం నాయకత్వానికి నిలువెత్తు రూపం వైయస్ రాజశేఖరుడు. మాటతప్పని ఆయన తీరు పేదల జీవితాల్లో వెలుగులు నింపాయి. మడమ తిప్పని ఆయన నైజం ప్రత్యర్ధులకు సింహస్వప్నం అయింది. ఎందరికో అసాధ్యమైన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి సంక్షేమ రథసారథిగా తెలుగు రాజకీయల్లో తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కర్ని బాగు చేయాలి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కన్నా గొప్ప కళ ఇది. తాను ఏ చోటుకి వెళ్ళినా గోడు ఉండకూడదు.. గూడు ఉండాలి అని కోరుకున్న గొప్ప నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వైఎస్ఆర్ పూర్తిపేరు ఏడుగురి సందింటి రాజశేఖరరెడ్డి. 1949 జూలై 8న ఆయన జన్మించారు.

తల్లిదండ్రులు జయమ్మ రాజారెడ్డి. పాఠశాల విద్యాభ్యాసం బళ్ళారిలో తర్వాత విజయవాడలోని లయోలా కళాశాలలో విద్య అభ్యసించారు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందారు. అనంతరం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల నుండి హౌస్ సర్జన్ గా పట్టా అందుకున్నారు. విద్య పూర్తయిన తర్వాత కొంతకాలం జమ్మలమడుగులో వైద్య అధికారిగా పని చేశారు. అనంతరం తండ్రి రాజారెడ్డి పేరుతో కట్టించిన ఆసుపత్రిలో పని చేశారు. వైయస్ సతీమణి విజయమ్మ. ఈ దంపతులకు ఇద్దరు సంతానం.

జగన్మోహన్ రెడ్డి కుమారుడు, షర్మిల కుమార్తె. వైఎస్ఆర్ విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపించేవారు ఇదే సమయంలో వైఎస్ఆర్ కుటుంబం కళాశాల నిర్మాణం ఆస్పత్రిని ఏర్పాటు వంటి సేవా కార్యక్రమాలు కొనసాగించింది. వైఎస్ఆర్ కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉండటం తో 1975 లో ఆంధ్ర ప్రదేశ్ యువజన కార్యదర్శిగా నియమితులైయ్యారు. అనంతరం 1978 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు అలా ఆయన రాజకీయ జీవితంలో కీలక దశ మొదలైంది. 1978లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారిగా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. అలా ఎప్పుడు పోటీ చేసి గెలుస్తూనే వచ్చేవారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర తన జీవితంలో ఓ కీలక మలుపుగా మారింది. ప్రతిపక్షనేతగా ఉన్న 2003 నుండి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. దీనిలో బాగంగా రాష్టం అంతా పాదయాత్ర చేపట్టారు. వేసవిలో పాదయాత్ర చేపట్టి దాదాపు 1500 కిలోమీటర్లు పర్యటించారు. ఈ యాత్రలో ప్రతి చోట ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాలు తెలుసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు కలిసి వారి ఇబ్బందులు కళ్ళారా చూసి చలించిపోయారు. ముఖ్యంగా రైతు సమస్యల మీద ఆయనకు పూర్తి అవగాహన కలిగింది. పర్యటన ముగిసేలోపు ప్రజల సమస్యలు పరిష్కారాల పై ఆయనకు పూర్తి అవగాహన వచ్చింది.

ఈ యాత్రలో ప్రజలు అభిమానుల నుండి వైయస్సార్ కు ప్రతిచోటా మద్దతు లభించింది. ప్రజలు కూడా ఆయనలోని నిజాయితీ అర్థం చేసుకొని తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించారు. వైఎస్సార్ తన రాజకీయ జీవితంలో అనేక పదవులు చేపట్టారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్య విజయం సాధించింది. దీంతో వైయస్ రాజశేఖర రెడ్డిని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అంటే 2009లోనూ వైయస్సార్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ విజయం సాధించింది. ఆయన రెండోసారి సీఎం పీఠాన్ని అధిష్టించారు. ప్రధానంగా రైతులకు లబ్ధి చేకూర్చేలా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే ఉచిత విద్యుత్ ఫైల్పై సంతకం చేశారు.

రైతుల జీవితాల్లో వెలుగు నింపేందుకు తొలిసారిగా ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించారు. పేదవారికి తగిన వైద్య చికిత్స పొందలేక పోయేవారు అయితే ప్రతి పేదవాడికి కార్పొరేట్ ఆస్పత్రిలో సరైన వైద్యం అందాలని వైఎస్ భావించారు. అందుకోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. అనారోగ్యంతో ఉన్న వారికి తక్షణ వైద్యం అందించేందుకు 108 అంబులెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టారు. నిరుపేదలు కూడా ఉన్నత చదువులు చదువుకునే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశారు. రైతులు బాగుండాలంటే పంటలు ఉండాలి.. అందుకోసం ప్రాజెక్ట్ లు ఉండాలి. అందుకోసం వైఎస్సార్ వివిధ ప్రాజెక్ట్ లను చేపట్టారు. రేషన్ షాప్ లో రెండు రూపాలకే కిలో బియ్యంతో పాటు.. ఇతర నిత్యవసర వస్తువులు కూడా తక్కువ ధరకే అందించారు.

ఇవే కాకుండా వృద్ధులు వితంతువులకు పింఛను అందించారు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సెప్టెంబర్ 2 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు హెలికాప్టర్ తో సంబంధాలు తెగిపోయాయి. ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా.. ఇరవై ఐదు గంటల తర్వాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్లు లభించాయి. వైఎస్ తో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తమ అభిమాన నాయకుడిని మరణాన్ని జీర్ణించుకోలేక కొంత మంది గుండె ఆగి మరణించగా.. ఇంకొంత మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంత గొప్ప నాయకుడు మరణించినా.. ఇంకా ప్రజల గుండేల్లో ఉన్నారు.

ఈ రోజు ఆయన జయంతి కారణంగా ఆయనకు సంబంధించి ఫోటోలు.. వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులు షేర్ చేసుకుంటున్నారు. ఏ టీవీ పెట్టిన.. ఏ వాట్సాప్ స్టేటస్ చూసిన.. ఫేసుబుక్ లో.. ట్విట్టర్లో.. ఎక్కడ చూసిన ఆయన గురించే వార్తలు. ఇంత గొప్ప నాయకుడిని మర్చిపోవడం అంత సులభం కాదు.. మాకు అన్నం పెట్టిన దేవుడు.. గొప్ప నాయకుడు అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం తన కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ఏపీ సీఎం. 2014లో తెలంగాణ నుండి విడిపోయిన తర్వాత ఏపీ రెండవ ముఖ్యమంత్రి గా పదవి చేపట్టారు. వైయస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ తో విభేదాల కారణంగా పార్టీ నుండి బయటకు వచ్చి వైసీపీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువై 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. తండ్రిలానే ఎన్నో గొప్ప పనులు చేస్తూ ప్రజల చేత వైఎస్ జగన్ ప్రశంసలు అందుకుంటున్నారు.

వైఎస్సార్ కు జగన్ నివాళులు.. భర్తపై పుస్తకం రాసిన వైఎస్ విజయమ్మ..!

ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కరోనా పాజిటివ్..?

అంబులెన్స్ నడిపిన ఎమ్మెల్యే రోజా.. వీడియో..!

సీఎం జగన్ నిర్ణయంకు జనసైనికులు ఆనందం.. ఏంటి సంగతి ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -