వైసీపీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ : వైసీపీలోకి 5 ఎమ్మెల్సీలు జంప్

966
Five MLCs jump from TDP to YCP
Five MLCs jump from TDP to YCP

శాసనసభ లో 151మంది ఎమ్మెల్యేలతో అన్ని భిల్లులను నెగ్గించుకుంటున్న ఏపీ ప్రభుత్వంకు శాసనమండలి మాత్రం బ్రేక్ వేస్తోంది. ఈ నేపథ్యంలో శాసన మండలి లో బలాన్ని పెందుకునే దిశగా వైసీపీ తొలి అడుగులు వేసింది. జగన్ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న శాసనమండలి ఇప్పుడప్పుడే రద్దు అయ్యే పరిస్థితి కనపడటం లేదు.

ఎందుకంటే మండలి బిల్లులో పార్లమెంట్ లో పాస్ కావాలి.. రాష్ట్రపతి అమోదం తెలిపాలి. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ బిల్ కు బీజేపీ ప్రాధాన్యత ఇవడం లేదు. అందుకే వైసీపీ కూడా ఇక మండలి రద్దు ఇప్పట్లో జరగదని భావిస్తోంది. ఇలాంటప్పుడు ఏపీ సీఎం జగన్ టీడీపీకి రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ కే వైసీపీ తరుఫున నిలబెట్టి ఆయన సీటును ఆయనతోనే భర్తీ చేశాడు. కాబట్టి మనం కూడా అధికార పార్టీలోకి వెళితే ఇలానే మన సీట్లకు కూడా ఢోకా ఉండదని టీడీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు భావిస్తున్నారట.

ఈ నేపథ్యంలో అందరూ మూకుమ్మడిగా త్వరలోనే వైసీపీలోకి జంప్ చేయడానికి ప్లాన్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో వైసీపీలోని పెద్ద ఆయన ఒక లీడర్ దగ్గరికి కొందరు వచ్చారని.. వైసీపీలోకి చేరికపై సమాలోచనలు చేస్తున్నారని తాడేపల్లిలో అనుకుంటున్నారు. మెల్లిగా అందరూ ఎమ్మెల్సీలు వైసీపీలోకి జారుకునే పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాబట్టి త్వరలోనే టీడీపీకి చెందిన 5 ఎమ్మెల్సీలు వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

పార్క్ హయత్ లో జరిగిన రహస్య భేటీపై జగన్ నిర్ణయం ఇదే ?

జేడీ లక్ష్మీనారయణ వైసీపీలో చేరబోతున్నారా ?

జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి..!

జగన్ న్యూ ప్లాన్.. టీడీపీకి ఎన్టీఆర్ పేరుతో చెక్..!

Loading...