Friday, April 19, 2024
- Advertisement -

వివేకానంద‌రెడ్డి లోటును మాజీ మంత్రి భ‌ర్తీ చేస్తారా…..?

- Advertisement -

ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌డ‌ప జిల్లాలో వైసీపీకీ మ‌రింత బ‌లం పెరుగ‌తోంది. తాజాగా ఉమ్మ‌డి రాష్ట్రంలో మంత్రిగా ప‌నిచేసిన డీఎల్ వైసీపీలో చేరేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. వివేకానంద‌రెడ్డి హ‌త్య‌తో క‌డ‌ప జిల్లా రాజ‌కీయాలు కీల‌కంగా మారాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో డీఎల్ చేర‌క ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

వైసీపీలో చేరాల్సిందిగా డీఎల్ రవీంద్రారెడ్డతో వైఎస్ఆర్సీపీ నేతలు సజ్జల, అవినాష్ భేటీ అయినట్లు సమాచారం. డీఎల్‌ను పార్టీకి రమ్మని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీంతో డీఎల్ కూడా వైసీపీలో చేరేందుకు సుముఖుత వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీలో చేరి వివేకానందరెడ్డి లేని లోటును భ‌ర్తీ చేస్తార‌ని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

వైఎస్ జ‌గ‌న్ నాకు ఫోన్ చేశార‌ని … మీ సేవలు అవసరం పార్టీలోకి రావాలని కోరార‌న్నారు. నేను వైఎస్ఆర్ కుటుంభ‌స‌భ్యుడ‌ని తెలిపారు. త్వ‌ర‌లో జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరుతున్నాన‌ని డీఎల్ ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ గెలుపు కోసం కృషి చేస్తా. వైఎస్‌ వివేకానందరెడ్డి స్థానాన్ని భర్తీ చేయాలని జగన్‌ కోరారు’ అని తెలిపారు.

సార్వత్రి ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుండి డీఎల్ రవీంద్రారెడ్డికి టీడీపీ టిక్కెట్టు ఇస్తారనే ప్రచారం జ‌రిగినా చివ‌ర‌కు అది ఉత్తిదేన‌ని తేలింది. ఆ టికెట్‌ను పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌కు బాబు కేటీయించారు. దీంతో డీఎల్ బాబుపై అసంతృప్తితో ఉన్నారు. ఇదే స‌మ‌యంలో వైసీపీనేత‌లు ట‌చ్‌లోకి వెల్ల‌డంతో ఆయ‌న పార్టీలో చేరేందుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు. ఎల్లుండి వైఎస్ జగన్.. పులివెందులలో నామినేషన్ వేయనుండగా… అదే రోజు జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. మ‌రి వివేకానంద‌రెడ్డి లోనుటు భ‌ర్తీ చేస్తారా అన్న‌ది చూడాల్సింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -