చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ల‌పై ఉండ‌వ‌ల్లి మ‌రో సారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

658
Former MP Undavalli Arun Kumar hot Comments on Chandra Babu and Pawan Kalyan
Former MP Undavalli Arun Kumar hot Comments on Chandra Babu and Pawan Kalyan

చంద్ర‌బాబుపై ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ మ‌రో సారి విరుచుకు ప‌డ్డారు. జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డానికి బాబు ద‌గ్గ‌ర ఎలాంటి ఆయుధాలు లేవ‌ని ఉన్న‌ది ఒకే ఒక్క ఆయుధం..ఆయ‌న‌పై ఉన్న కేసులేన‌ని ఉండ‌వ‌ల్లి అభిప్రాయ ప‌డ్డారు. జగన్ పై ఉన్న అవినీతి ఆరోపణల కేసులు, కోర్టు చుట్టూ తిరగడం వంటివన్నీ కూడా ఆయనకు మైనస్ పాయింట్లేనని అన్నారు. అయితే, జగన్ పై ఆరోపించిన అవినీతి కేసుల్లో సత్తా లేదని, ఈ ఆరోపణలన్నీ చాలా పేలవమైనవనన్నారు.

జ‌గ‌న్ పాద‌యాత్ర‌పైనా స్పందించారు. పాద‌యాత్ర వ‌ల్ల జగన్ కు ఎక్కువ మైలేజ్ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబులు చేసిన పాదయాత్రల కన్నా జగన్ ప్రజా సంకల్పయాత్రకు ప్రజల్లో ఎక్కువ స్పందన వచ్చిందని అభిప్రాయపడ్డారు. మ‌రో వైపు ప‌వ‌న్ క‌ళ్యాన్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో ప‌వ‌న్ నిర్వ‌హించిన మీటింగ్‌కి ఒక్క పొలిటీయన్ గా తనని మాత్రమే ఆహ్వానించిన విషయాన్ని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తావించారు.

అంత‌కు ముందు ఆయ‌న‌తో త‌న‌కు ప‌రిచ‌యం లేద‌ని….ఆ మీటింగ్ కి ఆహ్వానించడాన్ని తనకిచ్చిన అపారమైన గౌరవంగా భావించానని, ఈరోజుకి కూడా పవన్ కల్యాణ్ ని తానేమీ అనలేనని, తానేమీ కామెంట్ చేయలేనని అన్నారు. ప‌వ‌న్ అధికారంలోకి వ‌స్తే విమ‌ర్శ‌లు చేస్తాన‌న‌డం కొస‌మెరుపు.