Wednesday, April 17, 2024
- Advertisement -

బాబుపై ఊగిపోయిన ఉండ‌వ‌ల్లి…

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై మ‌రో సారి నిప్పులు చెరిగారు ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌. బాబుకు ప‌లు అంశాల‌పై ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. పోల‌వ‌రం నిర్మాణ ప్రాంతంలో భూమి కుంగిపోతోంద‌ని….ప్ర‌మాదక‌ర ప‌రిస్థితుల్లో ప్రాజెక్టు నిర్మాణం జ‌రుగుతోంద‌ని…భ‌విష్య‌త్తులో డ్యామ్ డ్యామేజి అయితె రాజ‌మండ్రి అడ్ర‌స్ గ‌ల్లంతు అవుతుంద‌ని హెచ్చ‌రించారు.

నిపుణులను పంపి పరిశీలన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పోలవరం విషయంలో చాలా దారుణాలు జరుగుతున్నాయని అక్కడి అధికారులే స్వయంగా తనకు చెబుతున్నారని ఉండవల్లి ఆరోపించారు. నిపుణులను పంపి పరిశీలన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

పోలవరం పూర్తైతే 80% భూమికి నీరు అందుతుంది. పోలవరం విషయంలో మీరు వెళ్తున్న దారి సరికాదని ముందు నుంచే చెబుతూ వచ్చాను. ప్రాజెక్టును చూసెదానికి కోట్లు ఖర్చు చేసి ప్రజలను తీసుకెల్లార‌ని…నేను వ‌స్తానంటె ఎవ‌రూ స్పందించ‌లేద‌న్నారు. ఇరిగేషన్ మంత్రి జూన్‌లో నీళ్లు ఇస్తామని గతంలో ప్రకటించారు. నిన్న చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఏడాదికి నీళ్లు ఇస్తామని ప్రకటించారు. మీరు వచ్చే ఏడాది తర్వాత అయిన నీళ్లు ఎలా ఇస్తారో చెప్పండంటూ ప్ర‌శ్నించారు.

సీఎస్ వర్సెస్ సీఎం వీరి గొడవపై కూడా స్పందించారు. ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న గొడ‌వేంటో అర్థం కావ‌డంలేద‌న్నారు. చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న వారికి బిల్లులు మంజూరు చేయలని తపన పడ్డారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఎల్వీపై ఆరోపణలు చేస్తున్నార‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -