Thursday, April 18, 2024
- Advertisement -

పార్టీ మారే యోచనలో గల్లా ఫ్యామిలీ….. అడిగినన్ని టికెట్లు ఇవ్వకపోతే……..?

- Advertisement -

టిడిపిలో సీట్ల తకరారు చంద్రబాబుకు తలబొప్పి కట్టిస్తోంది. 2019 ఎన్నికల్లో కొన్ని సీట్లలో టిడిపి కచ్చితంగా ఓడిపోతుందని ఆ పార్టీ నేతలు ముందే ఒక అభిప్రాయానికి వచ్చేశారు. అందుకే అందరూ కూడా గెలిచే అవకాశం ఉన్న సీట్లే కోరుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబుకు అదే పెద్ద సమస్య అయి కూర్చుంది. చంద్రగిరి నుంచి తాను పోటీచేయనని గల్లా అరుణకుమారి టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు. చంద్రగిరిలో 2019లో కూడా వైకాపా ఎమ్మెల్యే, జగన్‌కి సన్నిహితుడు అయిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి గెలుపు ఖాయమని గల్లా కుటుంబ సభ్యుల సొంత సర్వేలో తేలిందట. పక్కనే నగరి నియోజకవర్గంలో కూడా రోజా గెలుపు ఖాయం. అక్కడ టిడిపి పరిస్థితి అస్సలు బాగాలేదట.

అందుకే గల్లా కుటుంబం మొత్తం ఇప్పుడు గుంటూరుపై కన్నేశారు. గుంటూరు ఎంపిగా గల్లా అరుణకుమారి కొడుకు గల్లా జయదేవ్‌నే ఉన్నాడు. అందుకే గల్లా జయదేవ్ ఎంపి నియోజకవర్గం పరిధిలోనే తనకు ఏదో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని గల్లా అరుణకుమారి పట్టుబడుతున్నారు. అలా జరగని పక్షంలో టిడిపిని వీడడానికి కూడా వెనుకాడేది లేదని చెప్తున్నారు. 2019లో టిడిపి మరోసారి అధికారంలోకి రావడంపై ఎన్నో సందేహాలు ఉన్న నేపథ్యంలో నేతలు అందరూ కూడా ఇప్పుడు టిడిపి గెలిచే అవకాశం ఉన్న సీట్లలోనే పోటీ చేయాలని అనుకుంటున్నారు. అదే చంద్రబాబుకు చాలా పెద్ద తలనొప్పి తెస్తోంది. గుంటూరు ఎంపి టిక్కెట్‌తో పాటు గుంటూరు లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే టిక్కెట్ కూడా గల్లా కుటుంబానికి ఇవ్వకపోతే జయదేవ్, అరుణకుమారిలిద్దరూ కూడా టిడిపిని వీడడం ఖాయం. కానీ గల్లా అరుణకుమారికి టికెట్ ఇవ్వాలంటే గుంటూరు ఎవరో ఒక సీనియర్ నాయకుడిని వదులుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు ఇబ్బందులు ఎలా ఉన్నా అడిగిన టిక్కెట్స్ ఇస్తేనే టిడిపిలో ఉంటాం……లేకపోతే పార్టీ వీడడం ఖాయం అన్న హెచ్చరికలు అయితే గల్లా కుటుంబం చంద్రబాబుకు పంపించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -