Saturday, April 20, 2024
- Advertisement -

బాబుకు షాకుల మీద షాకులు…. వైకాపాలోకి టిడిపి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత

- Advertisement -

నారా చంద్రబాబునాయుడి ఓటమిని అందరికంటే ముందుగా టిడిపి నాయకులే గుర్తించినట్టున్నారు. అందుకే వీలైనంత త్వరగా ఇతర పార్టీల్లోకి జంప్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అసలే తెలంగాణా ప్రజలు కొట్టిన దెబ్బకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిన చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ టిడిపి నాయకులు వరుసగా వైకాపాలో చేరడానికి క్యూ కడుతూ ఉండడం షాకుల మీద షాకులు ఇస్తోంది. చంద్రబాబు భజన మీడియా అధినేతలు కూడా ఈ సారి చంద్రబాబు అధికారంలోకి రావడం కష్టమే అని అంతర్గతంగా అభిప్రాయపడుతుండడంతో టిడిపి నాయకుల్లో ఆందోళన తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. మోడీ ఆల్రెడీ టిడిపి నాయకుల అక్రమ వ్యాపారాలు, అవినీతిని బయటపెట్టే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు కేసీఆర్ కూడా ఓటుకు నోటుతో సహా అన్ని వ్యవహారాలను బయటకు తీయడం ఖాయం అని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయకత్వంపై పూర్తిగా నమ్మకం పోవడంతో పాటు, చంద్రబాబు పాలనపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పసిగడతున్న నాయకులు వరుసగా ఇతర పార్టీల్లో చేరడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. జనసేన పార్టీకి ఎలాగూ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేకపోవడం, పైగా చంద్రబాబు-పవన్‌లు ఒక గూటి పక్షులే అన్న విషయం తెలిసిన నాయకులు కావడంతో అందరూ కూడా వైకాపా వైపు చూస్తున్నారు. తాజాగా గిద్దలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు అన్నా రాంబాబు వైకాపాలో చేరాడు. బాలినేనితో సమావేశమైన అన్నా రాంబాబు త్వరలోనే జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్టు వెల్లడించాడు. టికెట్ విషయంలో పట్టుబడడంతో సహా షరతులు ఏవీ లేవని చంద్రబాబు అరాచక పాలన పట్ల గిద్దలూరు ప్రజలు ఏ స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారో అర్థం చేసుకుని జగన్ నాయకత్వంపై నమ్మకంతో వైకాపాలో చేరాలని నిర్ణయించుకున్నాని అన్నా రాంబాబు చెప్పారు. గిద్దలూరు నియోజకవర్గం టికెట్ ఎవ్వరికీ ఇచ్చిన చిత్తశుద్ధితో పనిచేసి వైకాపాను గెలిపిస్తానని, జగన్ అధికారంలోకి వస్తే వైఎస్ రాజశేఖరరెడ్డిలాగే జగన్ కూడా ప్రజలకు మంచి చేస్తారన్న నమ్మకం తనకు ఉందని అన్నా రాంబాబు చెప్పుకొచ్చారు. ఇంకా చాలా మంది టిడిపి నేతలు వైకాపాలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నారని, 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయం అన్న విషయం అందరికంటే ముందుగా టిడిపి నాయకులకే అర్థం అయిపోయిందని చెప్పుకొచ్చాడు అన్నా రాంబాబు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -