Friday, March 29, 2024
- Advertisement -

రోజాకు సూపర్ న్యూస్.. మంత్రి పది దక్కినట్లే ?

- Advertisement -

వైసీపీ నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్మన్ రోజాకు మంత్రి మండలి రద్దు వల్ల మంత్రి పదవి దక్కే అవకాశం ఉందా ? వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి కోసం చూస్తున్న రోజాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రిగా స్థానం కలిపిస్తారా ? అనే విషయంపై ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రోజాకు మంత్రి పదవి వస్తుందనే గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఏపీలో శాసన మండలి రద్దు చేయడంతో కేబినెట్ మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను రాజీనామా చేయించే ఆలోచనలో ఉంది. ఇక వీరు కూడా రాజీనామకు సిద్దంగా ఉన్నారు. కాబట్టి కేబినేట్ లో రెండు మంత్రి పదవులు ఖాళీ కానున్నాయి. ఈ కారణంగా రోజా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. గతంలో పదవులు ఆశించి భంగ పడ్డావారికి మంత్రి పదవులు ఇవ్వాలనే యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇందులో ప్రధానంగా రోజాకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఏపీ ఉన్న పరిస్థితిలో టీడీపీ విమర్శలకు ప్రతి విమర్శలు చేసే సమర్దులైన నాయకులు చాలా అవసరం. ఈ విషయంలో రోజా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎంతటివారికైన సమాధానం చెప్పగలదు. వాస్తవానికి రోజా తొలిసారి మంత్రివర్గంలో స్థానం ఆశించినా కొన్ని కారణాల చేత ఆమెకు జగన్ మంత్రి పదవి కల్పించలేకపోయారు.

ఆ తర్వాత రోజాకు ఏపీఐఐసీ పదవిని ఇచ్చినా ఆమె సంతృప్తి చెందలేదనేది పార్టీ వర్గాల్లో చర్చ. అయినప్పటికి పార్టీ కోసం రోజా పని చేశారు. తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసహనం చూపించకుండా జగన్ ఆదేశాల మేరకు నడుచుకున్నారు. వైసీపీపై కామెంట్స్ చేసిన వారిపై బలమైన గొంతు వినిపించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రోజాకు మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -