Friday, April 19, 2024
- Advertisement -

జగన్ నుంచి రోజా , విడదల రజిని లకు గుడ్ న్యూస్ ?

- Advertisement -

ఏపీ క్యాబినెట్ విస్తరణ తేదీ ఈ నెల 22 అని జగన్ నుంచి బయటకు లీక్ రావడంతో మంత్రి పదవులు పైన ఆశలు పెట్టుకున్న వారిలో కొత్త కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. జగన్ కి తాము కావాల్సిన వాళ్ళమని తమ తర్వాత మాత్రమే ఎవరికైనా మంత్రి పదవి కట్టపెడతారని మొదటి విడత విస్తీర్ణంలో సామాజిక వర్గ సమీకరణ కారణంగానే తమకు మంత్రి పదవి దక్కలేదని కానీ ఈసారి మాత్రం తమకు తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందని మీ చాలామంది జగన్ కి అత్యంత సన్నిహితులైన టువంటి ఎమ్మెల్యే ఆశలు పెట్టుకున్నారు.

మరికొద్ది రోజుల్లో ప్రస్తుతం మంత్రి మోపిదేవి వెంకటరమణ, సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు వెళ్ళిపోయి ఇక్కడ ఖాళీ చేయడంతో వాటితో పాటు ప్రస్తుతం మంత్రులుగా ఉన్నటువంటి కొంతమందిని తప్పించి జగన్ మరికొంత మందికి అవకాశం కల్పించి ఆలోచనతో ఉన్నారు అనే మాటలు వినిపిస్తుండడంతో ఆశావహులు పెద్ద ఎత్తున జగన్ కి దగ్గర అయ్యే అనేక మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు జగన్ ఎవరి పేర్లను మంత్రులుగా తీసుకుంటామని ప్రకటించలేదు. ప్రస్తుతం మంత్రి పదవికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్.. ఇద్దరూ బిసి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవులు రెండు దక్కబోతున్నాయని మిగతా మంత్రి పదవులు జగన్ వీర విధేయులైన వారికి మాత్రమే దక్కుతాయని పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎవరికి వారు తమకే మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకుంటున్నారు.

ముఖ్యంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన విడుదల రజిని, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్కే రోజా, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా చెందినటువంటి తెల్లం బాలరాజు, మదునురి ప్రసాద్ రాజు ఇంకా తూర్పు గోదావరి జిల్లా నుంచి పొన్నాడ సతీష్ కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి, జోగి రమేష్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది మంత్రి పదవి రేసులో ముందున్నారు. వీరిలో జగన్మోహన్రెడ్డి విడుదల రజినికి, రోజాకి పెద్ద పీట వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం త్వరలోనే చిక్కుముడి వీడుతోంది.

మోకా భాస్కరరావు హత్య వెనుక కొల్లు హస్తం.. : ఎస్పీ రవీంద్రనాథ్‌

కొల్లు రవీంద్రను అరెస్ట్ పై స్పందించిన కొడాలి నాని

రఘురామకృష్ణరాజు పై అనర్హత వేటు..?

జగన్ ని అభినందించిన పవన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -