జగన్ నిర్ణయం.. విడుదల రజినికి గుడ్ న్యూస్..?

2310
Good News MLA Vidadala Rajini
Good News MLA Vidadala Rajini

జగన్మోహన్ రెడ్డికి అల్లాటప్పాగా సైలెంట్ గా ఉన్నటువంటి వాళ్ళు నచ్చరు. దూకుడుగా ప్రతిపక్షాలకు ఎదురు వెళ్తూ.. జనానికి ఏది కావాలో అది తీసుకెళ్లి అందించేవారే కావాలి. అలా ఉన్నటువంటి స్ట్రాంగ్ లీడర్స్ లో విడుదల రజిని కూడా ఒకరని అని చెప్తూ ఉంటారు. అందుకే జగన్ మోహన్ రెడ్డి విడుదల రజినికి ఒక బ్రహ్మాండమైన శుభవార్త చేయబోతున్నారు అని తెలుస్తోంది. ఇంతకీ ఆ బ్రహ్మాండమైన శుభవార్త ని ఆమె ఎలా తీసుకోబోతున్నారు. రజిని విషయంలో జగన్ మోహన్ రెడ్డి అడుగులు ఎలా ఉండబోతున్నాయి ఇవన్నీ చూసే ముందు.. అసలు రజిని దూకుడు ఏంటో చూద్దాం. ఉదహారణకు మాజీ మంత్రి ఎమ్మెల్యే అచ్చం నాయుడు వ్యవహారాన్ని విడుదల రజిని చాలా స్ట్రాంగ్ గా ఖండించారు.

దాదాపు 150 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు ఏసీబీ అధికారుల వద్ద ఆయనకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయని ఆమె ఓపెన్ గా చెప్పారు. మొదట అచ్చం నాయుడు వ్యవహారంలో దూకుడుగా వ్యవహరించిన విడుదల రజిని అదే కంటూన్యూ చేశారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడే టిడిపి కాలం చెల్లిపోయిందని అలాంటి వారిని అరెస్టు చేయకా.. సత్కారం చేస్తారా అని ప్రశ్నించారు. మోసం చేసినటువంటి అచ్చెం నాయుడుని చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తే.. ఇదిఏదో బీసీలను అణగదొక్కే చర్యగా.. బీసీలకు ద్రోహం చేస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు.. ఆయన కుమారుడు లోకేష్ ఆ పార్టీ నాయకులంతా.. కులం రంగు ఎందుకు పురుముతున్నారని ఆమె గట్టి వాదన వినిపించి పోరాటం కూడా చేశారు. ఆ తర్వాత కాలంలో కూడా అంతకు ముందు కూడా విడుదల రజిని ఎప్పుడు కూడా వైకాపా తరపున గట్టి పోరాటాలు చేశారు. ఒక స్ట్రాంగ్ లీడర్ గా ఎదుగు తున్న టువంటి విడుదల రజిని తొలిసారి ఎన్నికల బరిలో దిగి టీడీపీ సీనియర్ నేతలను మట్టి కరిపించి యూవ సంచలనాల లిస్ట్ లో చేరిన చేసిన సంగతి తెలిసిందే. అయితే గెలిచాక కూడా తనదైన శైలిలో దూసుకుపోతోంది.

ఒక్క ఏడాదిలోనే మంచి క్రేజ్ తెచ్చినటువంటి ఎమ్మెల్యే లు చాలా చాలా కొద్ది మంది ఉన్నారు. అలా తొలిసారి గెలిచి క్రేజ్ సంపాదించుకున్న ఎమ్మెల్యేల్లో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని ముందు స్థానంలో ఉంటారు. 2019 ఎన్నికల్లో రజినీ.. టిడిపి సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావు చిత్తుగా ఓడించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. ఏడాది సమయంలోనే రాష్ట్ర స్థాయిలో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ఇంత క్రేజ్ తెచ్చుకున్న రజినికి వైకాపా అధిష్ఠానం సపోర్ట్ కూడా ఫుల్లుగా ఉందట. త్వరలోనే ఆమెకు మంత్రి పదవి ఖాయం అని ప్రచారం నడుస్తోంది.

అయితే ఆమెతో కాస్త విభేదాలు ఉన్నటువంటి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సైతం అధిష్టానం సైడ్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇది రజనికి బ్రహ్మాండమైన శుభవార్త అనే చెప్పుకోవాలి. ఎందుకంటే రెండు పక్షలకు పడట్లేదనే మాటలు వినిపిస్తాయి. గత కొన్ని నెలల నుంచి ఎంపీ లావు శ్రీకృష్ణకు, ఎమ్మెల్యే రజనికి పొసగని సంగతి తెలిసిందే. ఎంపీ చిలకలూరిపేట వచ్చిన ప్రతిసారి రజనీ వర్గం ఆయన ఏదో రకంగా అడ్డుకోవాలని చూస్తున్న నా మాట వినిపించింది. శ్రీ కృష్ణ సీనియర్ నేత మర్రి రాజశేఖర్ రెడ్డి సపోర్ట్ తో ఉండటంతో రజిని వర్గం రగిలిపోతుంది తెలుస్తోంది. ఎక్కడ తమ ఆధిపత్యం తగ్గిపోతుందన్న ఫీలింగ్ తో శ్రీ కృష్ణకు అడ్డు తగులుతున్నారనే మాట వినిపించింది. అయితే చిలకలూరిపేట కూడా నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. అయిన సరే రజిని వర్గం శ్రీకృష్ణుని నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వడం లేదు.

అనదికారిక కార్యక్రమాలకు వస్తున్న సరే ఏదో ఒక అడ్డంకి సృష్టింస్తున్నారన్న మాట వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో రజిని వర్గం తప్పు లేదని తెలియడంతో వైకాపా అదిష్టానం కూడా ఆమెకే ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. దానికి తోడు వైకాపా యూత్ లీడర్స్ లో.. అలాగే వైకాపాలో ఉన్నటువంటి యూత్ సపోర్టర్స్ లో అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి జనరేషన్ కి ఆమె ఒక ఇన్స్పిరేషన్ గా నిలవడంతో కూడా జగన్ ఈ విషయాన్ని పక్కన పెట్టేశారనే మాట వినిపిస్తోంది. శ్రీకృష్ణ వర్సెస్ రజనీ విషయంలో జగన్మోహన్ రెడ్డి రజనికి బ్రహ్మండమైన శుభవార్త చెప్పినట్లు అయిందని.. ఈ విషయంలో జగన్ ఇన్వాల్వ్ కాకుంటనే తమకు మంచి వార్తని అంటున్నారు.

చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయిన ఎంపీ విజయసాయి రెడ్డి

ఎంపీ రఘురామకు ఊహించని షాక్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు..!

కేసీఆర్ కంటే జగనే బెటర్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. అన్ని ఆసుపత్రిల్లో కరోనా ఉచిత చికిత్స..!

Loading...