Friday, March 29, 2024
- Advertisement -

ఎందుకు ఓడపోయామో బాబుకు జ్ణానోదయం కలిగించిన టీడీపీ సీనియర్ నేతలు

- Advertisement -

ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లు దక్కడంతో ఆ ప్రెస్టేషన్ నుంచి చంద్రబాబు ఇంకా కోలుకోలేదు. పార్టీ కార్యక్రమాల్లో ప్రతీసారి ఎందుకు ఓడిపోయానొ అర్థం కావట్లేదని సింపతీ కోసం ప్రయత్నిస్తూనె ఉన్నారు. ఓడిన ఒత్తిడిలో వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు మొదలు పెట్టారు. మొదటి జగన్ ప్రభుత్వానికి కొంత టైం ఇస్తామని చెప్పిన బాబు మాట తప్పారు.

తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు మితిమీరిపోతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. జగన్మోహన రెడ్డి ప్రభుత్వంలో దాడులు విపరీతం అయ్యాయి. ఎవ్వరినీ బతకనివ్వడం లేదు’.. అనే మాటలను కాస్త ముందు వెనుకగా మార్చి, చంద్రబాబునాయుడు పదేపదే వల్లిస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఓడిపోయామో అర్థం కావడంలేదని బాబు పదే పదే నిస్సిగ్గుగా సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. బాబుకు టీడీపీ సీనీయిర్ నేతు బుచ్చయ్య చౌదరి, అయ్యన్న పాత్రుడు జ్ణానోదయం కలిగించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఓటమిపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు. తాజాగా, విజయవాడలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు

ఈ సమావేశంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి రెచ్చిపోయారు. టీడీపీలో సొంత లాభం చూసుకునే వారికి స్థానం కల్పిస్తున్నారని, అలాంటివారికే పదవులు ఇస్తున్నారని గోరంట్ల విమర్శించారు. పార్టీలో ఉన్నప్పుడు బాగా డబ్బు వెనకేసుకుని, పదవులు అనుభవించి వెళ్లిపోతున్నారంటూ మండిపడ్డారు. పార్టీలో మహిళలకు తగిన ప్రాధాన్యం లేదని మండిపడ్డారు.

చంద్రబాబు ఓడిపోవడానికి అసలు కారణం మంత్రులు, జిల్లా, మండల స్థాయి నేతలేనని కుండబద్దలు కొట్టారు. వాళ్లు అవినీతి, బంధుప్రీతి, జనంతో సక్రమంగా వ్యవహరించని కారణంగానే ఈ ఓటఎదురయ్యిందని కుండ బద్దలు కొట్టారు.

ఇక అయ్యన్నపాత్రుడు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై విస్పష్టంగా స్పందించారు. ఎవరికైనా ఆకలేసినప్పుడే అన్నం పెట్టాలని, అప్పుడు మాత్రమే అన్నం విలువ తెలుస్తుందని అన్నారు. ఇప్పుడే జనంలోకి వెళితే ప్రయోజనం ఉండదని బాబుకు హిత బోద చేశారు. ఇప్పటికైనా ఓటమికి కారణాలు తెలియడంలేదనె మాటను పక్క పెడతారో లేకపోతె అాదే పట్టుకొని వేళాడుతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -