Friday, March 29, 2024
- Advertisement -

చంద్రబాబుకు షాకిచ్చిన జగన్.. ఏం జరిగింది ?

- Advertisement -

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఏపీ సీఎం జగన్ ఊహించని షాక్ ఇచ్చారు. ఉండవల్లిలోని బాబు నివాసానికి అధికారులు నోటీసులు పంపారు. కృష్ణా నది వరద 5 లక్షల క్యూసెక్కులకు పెరగడం వల్ల నోటీసులు జారీ చేస్తున్నట్లు అధికార్లు అంటున్నారు. బాబు ఇంటితో పాటూ కరకట్టపై ఉన్న నివాసాలకు కూడా నోటీసులు ఇచ్చారు.

వరద పొంగు ఎక్కువగా ఉండటం వల్ల సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని కోరారు. భారీ వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల కృష్ణా నదికి వరద పోటెత్తింది. కృష్ణా నదిలో వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో నీటిని కిందకు వదులుతున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద వచ్చి చేరుతుంది. రోజు రోజుకు ఈ తీవ్రత పెరుగుతుండటంతో కృష్ణానది కరకట్టపై ఉన్న నివాసాలకు ప్రభుత్వ అధికారులు నోటీసులు జారీ చేశారు. అందుకే చంద్రబాబుతో పాటూ కరకట్టపై ఉన్న ఇళ్లు, ఇతర భవనాలకు నోటీసులు ఇస్తున్నారు.

గతేడాది కూడా వర్షాలు అధికంగా ఉండటంతో ప్రకాశం బ్యారేజీకి వరద భారీగా పెరిగింది. అప్పుడు కూడా బాబుకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇంటిని ఖాళీ చేయాలని సూచించారు. ఈ విషయంపై అప్పట్లో రాజకీయంగా దుమారం రేగింది. ఉద్దేశపూర్వకంగానే ప్రకాశం బ్యారేజీ గేట్లు మూసేసి వరద పెరిగేలా చేసి బాబు ఇంటిని మునిగేలా చేశారన్ని టీడీపీ లీడర్లు ఆరోపణలు చేశారు.

మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..!

తెలంగాణ సర్కార్‌ను నిలదీసిన హైకోర్టు…

మీ విధానాలు అన్ని రాష్ట్రాలకి ఆదర్శం.. జగన్ పై మోడీ ప్రశంసలు..!

ఢిల్లీకి వెళ్లకముందే.. మోడీ నుంచి జగన్ కు గుడ్ న్యూస్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -