Thursday, April 25, 2024
- Advertisement -

తగ్గని కేసీఆర్.. తమిళిసై రంగంలోకి.. ఏం జరగబోతోంది?

- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై తగ్గడం లేదు. ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగాలు ఊడిపోయినట్టేనని.. కొత్తగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక కేసీఆర్ ఉద్యోగుల సమ్మెపై ఉక్కుపాదం మోపడంతో కాంగ్రెస్, బీజేపీ, ప్రతిపక్షాలు దీన్ని అనుకూలంగా మార్చుకునేందుకు రాజకీయం మొదలుపెట్టాయి. సమ్మె విషయంలో గులాబీ పార్టీకి నష్టం చేకూర్చేవిధంగా పావులు కదుపుతున్నాయి.

ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ద్వారా నరుక్కురావాలని బీజేపీ యోచిస్తోంది. ఆమెను ముందు పెట్టి కేసీఆర్ ను ఆడించాలని బీజేపీ నేతలు వరుసగా గవర్నర్ వద్దకు వెళుతూ వినతిపత్రాలు సమర్పిస్తూ హల్ చల్ చేస్తున్నారు.

ఇక బీజేపీ రాజకీయంగా కూడా సమ్మెతో టీఆర్ఎస్ ను నష్టపరిచే ఎత్తుగడ వేసింది. టీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలతో బీజేపీలో టచ్ లో ఉందనే ప్రచారం సాగుతోంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో బీజేపీ ఈ ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఇక ఆర్టీసీ సమ్మె టీఆర్ఎస్ లో కూడా చీలికలు తెచ్చింది. ఎంపీ కేశవరావు చేసిన ప్రకటన కూడా కేసీఆర్ కు కోపం తెప్పించిందట.. ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగుస్తుండడంతో కేశవరావు ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలుపడం..ఖమ్మం వెళ్లి పరామర్శించడం కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా సాగింది. ఈనేపథ్యంలోనే తెలంగాణలో ఆర్టీసీ సమ్మెతో కేసీఆర్ ను బుక్ చేయాలని చూస్తున్న బీజేపీ యత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి మరీ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -