Thursday, March 28, 2024
- Advertisement -

పాపం ప్ర‌త్తిపాటి… అలా చేస్తే బెట‌రేమో… !

- Advertisement -

గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప‌రిస్తితి ఏంటి? ఇక్క‌డ నుంచి సీనియ‌ర్ మోస్ట్‌గా ఉన్న ఎ మ్మెల్యే కమ్‌ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని ఎలా న‌డిపిస్తున్నారు? వ‌ంటి కీల‌క ప్ర‌శ్న‌లు తెరమీ దికి వ‌స్తున్నాయి. అంతేకాదు, ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో ప్ర‌త్తిపాటి గెలుస్తాడా? అనే సందేహాలు సైతం తెర‌మీదికి వ స్తుండ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే..మంత్రి పుల్లారావు ఆయన కుటుంబసభ్యులపై వ్యతిరేకతతో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు..ఆయనకు క‌లిసి రావ‌డం లేద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు, ప్ర‌త్తిపాటిపై పోటీ కే కాదు.. ఓడించ‌డానికి కూడా సై! అంటున్న విడ‌ద‌ల ర‌జ‌నీని చూసి వీరంతా ప్ర‌త్తిపాటికి తగిన శాస్తి జరగబోతోందని చ‌ర్చించుకుంటున్నార‌ట‌.

కుటుంబ రాజ‌కీయాల నేప‌థ్యంలో ముఖ్యంగా ప్ర‌త్తిపాటి ఆయ‌న స‌తీమ‌ణిని కంట్రోల్ చేసుకోలేని కార‌ణంగా అటు ప్రభుత్వంలో పట్టు కోల్పోయారు. ఇటు చిలకలూరిపేటలో పార్టీ పరిస్థితి గందరగోళంలో ఉంది. వివిధ వర్గాలకు పండు గలకు సంబంధించిన చంద్ర‌న్న తోఫా, సంక్రాంతి కానుక‌ల విష‌యంలో భారీ ఎత్తున్న అవినీతి జరిగిందని విమ ర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. దీంతో చిలకలూరిపేటకు మాత్రమే ఆయన మంత్రిగా మిగిలిపోయారని అంటున్నారు పార్టీ నాయ‌కులే. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ అభ్యర్థిగా మళ్లీ పుల్లారావు పోటీ చేయడం ఖాయం గా క‌నిపిస్తోంది. అయితే, వైసీపీ అబ్య‌ర్థిగా ర‌జ‌నీ రంగంలోకి దిగితే.. ఈయ‌న‌ను ఎవ‌రు గెలిపిస్తారు? అనేది ఇప్పుడు గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్‌.

నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినా..గ్రామ గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించినా…సంక్షేమ పథకాలు పేద వర్గాలకు అందజేసినా.. మంత్రి పుల్లారావు కుటుంబ సభ్యుల వ్యవహారశైలే..భవిష్యత్‌ ఎన్నికల్లో ఆయన కొంప ముంచబోతోంద‌నే ప్ర‌చారం కూడా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి ఇప్పుడు ఈపోస్ యంత్రాలు వ‌చ్చాక పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖలో మంత్రికి పనిలేకుండా పోయింది. దీనికితోడు ఇన్‌ఛార్జి మంత్రిగా పశ్చిమగోదావరి జిల్లాలో నాయకులను ఒకే దారిలో నడిపించలేకపోతున్నారు. ఇటు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఫెయిల్‌, మంత్రిగా త‌డ‌బాట్లు, ఇంచార్జిగానూ విఫ‌లం..

సీనియ‌ర్ నేత‌గా ఉన్న‌ప్ప‌టికీ.. గోదావరి జిల్లాలో నాయకుల మధ్య విభేదాలను సరి చేయడంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, నాయకుల మధ్య సమన్వయం లోపించినప్పుడు మంత్రి ఘోరంగా విఫలమయ్యారనే అప‌వాదును మూట‌గ‌ట్టుకున్నారు. ఇక ఆయ‌న శాఖ‌పై వ‌చ్చిన తీవ్ర‌మైన అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో పుల్లారావును గ‌త ఎన్నిక‌ల్లోనే మంత్రిగా త‌ప్పించేస్తార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. అయితే పుల్లారావు మేనేజ్ చేసుకుని కేబినెట్ వేటు నుంచి బ‌య‌ట ప‌డ్డార‌న్న ప్ర‌చార‌మూ ఉంది. ఇటు నియోజ‌క‌వ‌ర్గంలో సొంత కేడ‌ర్ కూడా ఆయ‌న తీరుపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. మ‌రి ఈ కామెంట్ల‌కు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తారో… లేక త‌న‌ను తాను సంస్క‌రించుకుంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -