Friday, April 26, 2024
- Advertisement -

పేట‌లో జ‌గ‌న్ వ్యూహం స‌క్సెస్‌…. పుల్లారావుకు టెన్ష‌న్‌

- Advertisement -

గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మరాయి. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఇటీవల మహిళా నాయకురాలు విడదల రజినీ కుమారిని ఆ పార్టీ నియమించడంతో వైసీపీలో నిన్నమొన్నటి వరకు నెలకొన్న అసమ్మ‌తి జ్వాల‌లు క్రమక్రమంగా తెరమరుగు అవుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా నియోకవర్గంలో పలు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైన రజినీకుమారి నియోజకవర్గంలో కులాలు, మతాలు పార్టీలకు అతీతంగా చొచ్చుకుపోయారు. రజినీకుమారికి పార్టీ నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వడంతో వైసీపీలో ఒక్కసారిగా అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడినా.. క్రమక్రమంగా అవన్నీ సమసిపోతున్నాయి.

వాస్తవంగా చూస్తే నియోజకవర్గంలో గత కొన్ని దశాబ్దాలుగా దివంగతి మాజీ నేత సోమేపల్లి సాంబయ్య ఆ తర్వాత ఆయ‌న రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మర్రి రాజశేఖ‌ర్ చుట్టూనే కాంగ్రెస్‌, ఆ త‌ర్వాత వైసీపీ రాజ‌కీయాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ బాధ్యతలు రజినీకుమారికి అప్పగించడంపై నియోజకవర్గంలో ఓ ప్రధాన సామాజిక వర్గంలో మినహా మిగిలిన అన్ని సామాజికవర్గాల్లోను ఆమెకు సానుకుల వాతావరణమే కనిపిస్తోంది. కాపు సామాజికవర్గంతో పాటు బీసి సామాజికవర్గంలోను, రెడ్డీ సామాజికవర్గంలోను, ఎస్సీలోను, మైనార్టీల్లోను ఆమెకు అనుకూల వాతావరణం కనిపిస్తోంది.

ఎన్‌ఆర్‌ఐ అయిన రజినీకుమారి బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళ కాగా, ఆమె భర్త కాపు సామాజికవర్గం కావడంతో కుల స‌మీక‌ర‌ణ‌లు, మ‌హిళా కోటా ఇక్క‌డ బాగా వ‌ర్క‌వుట్ అయ్యే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి. స్థానికంగా చిలకలూరిపేట పట్ట‌ణంతో పాటు నియోజకవర్గంలో వీళ్లకు పట్టు ఉండడంతో ఈ ఈక్వేషన్లు రేపు ఆమెకు ఎన్నికల్లో కలిసిరానున్నాయి. తాజాగా వైసీపీలో నెలకొన్న అసమ్మ‌తి జ్వాల‌లు ఒక్కసారిగా చల్లారడంతో ప్రస్తుతం మహిళ కోటాలో బీసీ, కాపు ఈక్వేషన్‌ పరంగా చూస్తే రజినీకుమారి అభ్య‌ర్థిత్వం సరైందని నియోజకవర్గాల్లో మెజార్టీ రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక ఓ బీసి సామాజికవర్గానికి చెందినటువంటి డైనమిక్‌ లేడిగా రజినీకుమారికి పార్టీ అదిష్టానం సీటు ఇవ్వడంతో జిల్లా వైసీపీకి కూడా చాలా ప్లస్‌ అవుతుందని మిగిలిన నియోజకవర్గాల నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా నిన్న‌టి వ‌ర‌కు మంత్రిగా త‌న‌కు తిరుగులేద‌ని భావించిన ప్ర‌త్తిపాటి పుల్ల‌రావుకు ఇప్పుడు డైన‌మిక్ లేడీ ర‌జ‌నీ చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌జ‌నీ ఎలా దూకుడుగా ముందుకు వెళ్లిందే… ఎన్నిక‌ల వ‌ర‌కు అవే ప‌దునైన వ్యూహాల‌తో ముందుకు వెళితే పుల్లారావు జాత‌కం తారుమారు అయినా పెద్ద‌గా ఆశ్చ‌ర్య ప‌డాల్సిన ప‌నిలేదు. పుల్లారావును ఓడిస్తాన‌ని స‌వాల్ చేస్తూ చివ‌ర‌కు వైసీపీ అభ్య‌ర్థిత్వం వ‌ర‌కు దూసుకొచ్చిన ర‌జ‌నీ దెబ్బ‌తో అటు ఆయ‌న టెన్ష‌న్‌లో ఉన్న‌ట్టు టీడీపీ వ‌ర్గాలే చ‌ర్చించుకుంటున్నాయి. యేడాది కాలంలో ర‌జ‌నీ గ్రాఫ్ ఎలా స్పీడ్‌గా ఉందో చూస్తేనే ఇది అర్థం చేసుకోవ‌చ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -