Thursday, March 28, 2024
- Advertisement -

హరీష్ రావు వద్దకు దుబ్బాక ప్రజలు.. మాట ఇస్తున్నారా..?

- Advertisement -

తెలంగాణాలో ని దుబ్బాక లో గెలవడానికి నాయకు అక్కడి ప్రజలకు వరాల మీద వారలు కురిపిస్తున్నారు.. ఈ ఎన్నికను అన్ని పార్టీ లు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎలాగైనా ఇక్కడ గెలవాలని కృషి చేస్తున్నాయి.. దాంతో ప్రజలకు దగ్గరవడానికి అన్ని పార్టీ లు అక్కడి ప్రజలకు వరాలు కురిపిస్తున్నారు..ఇక తెలంగాణ  వచ్చిన తర్వాత ఇప్పటివరకు ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది లేదు తెరాస పార్టు..  అందుకే కేసీఆర్ రెండు ఎన్నికల్లోనూ వరుసగా మంచి మెజారిటీ తో గెలుస్తూ వచ్చారు.. ప్రజా సంక్షేమ పథకాలు అమలు తో పాటు ఎన్నికల పై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ సమయంలో ప్రజలకు కొండంత ధైర్యం ఇవ్వడం వల్లే కేసీఆర్ ప్రజల్లోకి దూసుకుపోవడానికి కారణం అని చెప్తుంటారు..

ముఖ్యంగా ఉప ఎన్నికలొచ్చినప్పుడు కేసీఆర్ అవిశ్రాంత శ్రమ నే ఎప్పుడు ఆయన్ని గెలిపిస్తూ ఉంటుంది.. ఇక ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికలు తెలంగాణాలో ఆసక్తి కర రాజకీయం చేయడానికి ఊతం గా మారుతున్నాయి.. కేటీఆర్ గ్రేటర్ ఎన్నికల పై దృష్టి పెట్టగా, హరీష్ రావు దుబ్బాక ఎన్నికల్లో పార్టీ గెలిచేవిధంగా కృషి చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో  అయన అక్కడి ప్రజలకు దగ్గరయ్యే విధంగా, ప్రతిపక్షాలను ప్రజలకు దూరం చేసే విధంగా వ్యూహాలు రచిస్తున్నారట.. ఓటర్లు కూడా ఈ ఎన్నికను తమకు ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు..

నియోజకవర్గానికి సంబంధించిన పలు డిమాండ్ల పై సిఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావు హామీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దుబ్బాక ప్రజల మొదటి డిమాండ్ రెవిన్యూ డివిజన్. దుబ్బాకలో ఇప్పటికే దౌల్తాబాద్, రాయపోల్, తొగుట, మిరుదొడ్డి మండలాల వ్యవసాయ శాఖ ఏడిఏ కార్యాలయం ఉంది. డివిజన్ కేంద్రం ఏర్పాటు తో ఆర్డీవో కార్యాలయంతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు వస్తే అభివృద్ధికి అవకాశం ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్న సమస్యలను హరీష్ రావు ముందు ఉంచి పరిష్కారం చూపమంటున్నారు.. దానికి హరీష్ రావు కూడా ఒకే అనడంతో పాటు ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని.. దుబ్బాకను మరో సిద్దిపేటను చేస్తానని చెబతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తెరాస వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది..

టీఆర్ఎస్ అంతకుమించి ప్లాన్ చేసిందా..?

దుబ్బాక లో టీఅరెస్ గెలుపు ఖాయం.. 

గారాలపట్టి కి కెసిఆర్ మంత్రి పదవి..?

దుబ్బాక లో ఎవరి బలం ఎంత..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -