Thursday, April 25, 2024
- Advertisement -

అమరావతిలో బయటప పడిన బాబు మరో అవినీతి బండారం..

- Advertisement -

అమరావతిని ప్రపంచస్ధాయి నగరంగా నిర్మిస్తానంటూ ఊదర గొట్టిన చంద్రబాబునాయుడు చేసిన అవినీతి పాపాలు ఒక్కక్కటే బయట పడుతున్నాయి. తాత్కాలిక నిర్మాణాలు అంటూ వందల కోట్లు తగలేసి కట్టిన కట్టడాలు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ను తలపిస్తున్నాయి. ప్రపంచస్ధాయి నగరం మాట దేవుడెరుగు చిన్నపాటి వర్షానికే భారీ ఎత్తున కారె నిర్మాణాలు మాత్రం చేసేశారంటూ అక్కడి ప్రజలు అనుకుంటున్నారు.

తాజాగా బాబు అవినీతికి మరో పరాకాష్ట బయటపడింది. కొద్ది పాటి వర్షానికే స్మిమ్మింగ్ పూల్ ను తలపిస్తున్నాయి హైకోర్టు భవనాలు.అమరావతి ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి హై కోర్టు భవనంలో చాలా గదులు వర్షపు నీటితో నిండిపోయింది.గదుల్లో నిండిపోయిన వర్షపు నీటిని తోడి బయటకు పొయ్యలేక సిబ్బంది నానా అవస్తలు పడుతున్నారు. ఒకవైపు నీటిని బయటకు తోసేస్తుంటే మరోవైపు పై కప్పు నుండి గోడల మీదుగా నీరు కురుస్తోంది.

నీరు కారడంతోపాటు ప్పు, గోడలు, ఫ్లోరింగ్ కూడా పాడయిపోతోంది. నిజానికి నిర్మాణంలో ఉన్నపుడే ఈ భవనం నాణ్యతపై అనేకమందికి అనుమానాలు వచ్చిన సంగతి తెలిసిందే.అధికారంలో ఉన్నప్పుడు బాబు మసిపూసి మారేడు కాయచేశారు.అప్పట్లోనే ఒకవైపు నిర్మిస్తున్న గోడ కూలిపోవటం, వర్షానికి నిర్మాణదశలోనే కురిసినా ఏదో మేకప్ చేసేసి బ్రహ్మాండంగా కట్టేశామనిపించుకున్నారు. ఇంతోటి తాత్కాలిక భవనానికి కూడా చంద్రబాబు రూ. 150 కోట్లు ఖర్చు చేసేశారు.ఇదీ చంద్రబాబు నాయుడి మార్కు అభివృద్ధి.

అసలు మొదటగా నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయాలను కూడా నాసిరకం నిర్మాణాలతో కట్టారు. వీటికి కూడా వందల కోట్ల రూపాయలు అయినట్లు చెప్పారు. గతంలో చిన్నపాటి వర్షానికే అసెంబ్లీ,సచివాలయాలు స్మిమ్మింగ్ పూల్ ను తలపించన సంగతి తెలిసిందే.ఇంతోటి నాసిరకం నిర్మాణాలకే చంద్రబాబు వందల కోట్ల రూపాయలు చెల్లించారు. ఏ నిర్మాణం చూసినా, ఏ ప్రాజెక్టు చేపట్టినా, ఏ పథకాన్ని అమలు చేసినా మొత్తం అవినీతి మయం అని మరోసారి తేలిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -