Thursday, April 25, 2024
- Advertisement -

జ‌గ‌న్ దాడి కేసు విచార‌ణ‌పై తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేసిన హైకోర్టు…

- Advertisement -

ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత పై హత్యాయత్నం జరిగిన కేసులో అటు ఆ రాష్ట్ర ప్రభుత్వమూ ఇటు కేంద్రప్రభుత్వం సరిగా స్పందించక పోవటంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఐఎస్ఎఫ్ ఇచ్చిన నివేదిక సరిగ్గా లేదని తెలుగు రాష్ట్రాల హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు విషయానికి సంబంధించి కేంద్రప్రభుత్వం సీల్డ్ కవర్ లో పంపించిన నివేదికపై హైకోర్టు మండిపడింది.

ఈ రిపోర్టు లోపాలతో ఉందని చివాట్లు పెడుతూ, మరో నివేదికను 21వ తేదీలోగా ఇవ్వాలని ఆదేశిస్తూ, కేసు విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది. ఇకపోతే విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించే విషయంపై పరిశీలన జరుగుతోందని కేంద్రప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదిక సమర్పించింది.హత్యాయత్నం జరిగిన ప్రాంతం ఎన్‌ఐఏ చట్టంలో నిర్ధేశించిన నేరాల పరిధి లోకి వస్తుందో? రాదో? పరిశీలన చేసి, ఆ తరువాత దర్యాప్తు పై నిర్ణయం తీసుకుంటామని, అందుకు కొంత సమయం పడుతుందని కూడా వివరించింది.

ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఎన్‌ఐఏ దర్యాప్తు పై ఏ నిర్ణయం తీసుకున్నా, బహిర్గతం చేయకుండా సీల్డ్‌ కవర్‌ లో తమ ముందుంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే శుక్రవారం కేంద్ర ప్రభుత్వం సీల్డ్‌ కవర్‌ లో పంపిన నివేదికపై మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తూ మళ్లీ పూర్తిస్థాయి నివేదిక పంపాలని కేంద్రాన్ని ఆదేశించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -