తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్..!

344
Home Minister Tested Positive For The Virus
Home Minister Tested Positive For The Virus

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ అని తేలినట్టు తెలిసింది. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో అపోలో హాస్పిటల్ కు తరలించారు. చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే హోంమంత్రితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.

ఆయన ఇంటి పరిసరలను మునిసిపల్ సిబ్బంది శానిటైజ్ చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి పలువురు మంత్రులు ఆయన ఫ్యామిలీకి ఫోన్ చేసి వివరాలు తెలిజేస్తున్నారు. కాగా, కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న మహమూద్ అలీ మూడు రోజుల క్రితం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు అస్తమా ఉండటంతో ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు ఆయనను ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ నుంచే ఆయనను అపోలోకి తరలించారు.

ఇప్పటికే తెలంగాణలో కొందరి నేతలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇటీవలే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ ‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌కి కరోనా సోకింది. కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు కూడా ఓ ప్రైవేటు హాస్పిటల్ లో కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు.

ఎందుకయ్యా చిట్టినాయుడూ.. గొడవలోకి మీ ఆవిడను లాగుతావ్ : విజయ సాయి

ఢిల్లీలో రఘురామకు ఊహించని షాక్.. చక్రం తిప్పిన జగన్..!

ఉచితంగా ఇసుక పంపిణీ : జగన్ సంచలన నిర్ణయం..!

విశాఖ నుంచే పరిపాలన.. జగన్ ఫిక్స్..!

Loading...