Tuesday, April 23, 2024
- Advertisement -

సోనియానే కీలకం.. టీకాంగ్రెస్ లో మొగ్గెవరికి?

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక చిచ్చు పెట్టింది. తన భార్య పద్మావతినే పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రకటించడం.. వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ అభ్యంతరం తెలుపడంతో కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది.

ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే రేవంత్ రెడ్డి వెంట ఎవరెవరు కాంగ్రెస్ నేతలు నడుస్తారన్నది ఆసక్తిగా మారింది. తాజాగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డితో భేటి అయ్యి మద్దతు కూడగట్టారు. మరికొంత మందితో లాబీయింగ్ చేస్తున్నారు..

కాగా రేవంత్ యత్నాలకు చెక్ పెట్టే యోచనలో ఉత్తమ్ ఉన్నట్టు తెలిసింది. ఇదివరకు తమలో తామే కొట్టుకున్న ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డిలు ఇప్పుడు ఏకతాటిపైకి రాబోతున్నారట.. ఈ మేరకు పీసీసీ చీఫ్ గా కొత్తగా కోమటిరెడ్డి పేరును తెరపైకి తెస్తున్నారట.. దీనికి ఉత్తమ్ ప్రతిపాదించగా.. జానారెడ్డి కూడా సరేనన్నట్టు తెలిసింది.తాజాగా కోమటిరెడ్డి కూడా దీన్ని ధ్రువీకరించడం గమనార్హం.

ఇలా రేవంత్ రెడ్డి పార్టీలో ఎదగడానికి చేస్తున్న ప్రయత్నాలను నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్లు అడ్డుకట్ట వేస్తున్నారు.. అయితే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి అప్పజెప్పాలనే విషయం పూర్తిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేతుల్లోనే ఉంది. ఆమె తలుచుకుంటే రేవంత్ ను పీసీసీ చీఫ్ చేయగలదు. కానీ ఈ నిర్ణయాన్ని సీనియర్లు అయిన ఉత్తమ్, జానా, కోమటిరెడ్డి ఒప్పుకుంటారా? రేవంత్ కింద పనిచేస్తారా అన్నది డౌటే. అందుకే తెలంగాణ పీసీసీ చీఫ్ తేనెతుట్టను కదిపేందుకు కాంగ్రెస్ అధిష్టానం రెడీగా లేదన్న అంచనాలు ఏర్పడుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -