Tuesday, April 23, 2024
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ఇలా జరిగితే మాత్రం చరిత్ర సృష్టించొచ్చు..?

- Advertisement -

అధికార పక్షం, ప్రతిపక్షం.. ఏ రాష్ర రాజకీయాలకైనా, ఏ దేశ రాజకీయాలకైనా ఈ రెండు ఆయువు పట్లు.. పార్టీ లు ఎన్నైనా ఒక రాష్ట్రంలో అధికార పక్షం ఒకటి , ప్రతిపక్షాలు మిగిలినవిగా గుర్తిస్తారు.. ఈ ఐదేళ్లు అధికార పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలను పరిపాలిస్తుండగా ప్రతిపక్షాలు ప్రభుత్వం చేసే తప్పుల్ని, అన్యాయాల్ని వేలెత్తి చూపి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి.. అయితే ఈ రెండు పార్టీ లు చేసేది ప్రజల మేలు కోసమే అయిన అధికారంలో ఉన్న పార్టీ మాటే ఎప్పుడు చెల్లుతుంది.. ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంలో ఉన్నా కూడా తమ మాట చెల్లుబాటు అయ్యేలా చూస్తుంది టీడీపీ..

జనాలు అధికారం నుంచి దింపినా ఇంకా ఆ భ్రమలోనే చంద్రబాబు ఉండడం ప్రజలకు విడ్డూరంగా ఉంది.. ఇక ప్రతిపక్షం చేయాల్సిన ఏ పని కూడా టీడీపీ సరిగ్గా చేయడం లేదని వాదన బలంగా బయటికి వస్తుంది.. ప్రతిపక్షంలో ఉంటూ ప్రజలకు మేలు జరిగే ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించడం మానేసి స్వా లాభం కోసం పాకులాడుతున్నారు.. ఇక ఇటీవలే తెలంగాణ లో జరిగిన ఓ పరిణామం తమ రాష్ట్రంలో జరిగితే చూడాలని ఉంది అంటున్నారు ప్రజలు.. ఇటీవలే అసెంబ్లీ సమావేశాలు  తెలంగాణాలో జరుగుతున్నాయి. ప్రతిపక్షాల విమర్శలు, అధికార పార్టీ ప్రకటనలతో ఎంతో రసవత్తరంగా జరుగుతున్న భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డబుల్ బెడ్ రూమ్ ల విషయంలో నిలదీస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ భ‌ట్టి స‌వాల్‌ను త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ స్వీక‌రించారు.

 రాజ‌ధానిలో ల‌క్ష డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎక్క‌డ నిర్మించారో చూపాల‌ని స‌వాల్ విసిరారు. అందుకు తలసాని సరే అని ఆయనకి ఇప్పుడు  డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు చూపించే పని లో ఉన్నారు.. అయితే ఈ సీన్ తమ రాష్టంలో చూసే ఛాన్స్ వస్తుందా ప్రజలు ఆశపడుతున్నారు.. జగన్, చంద్రబాబు లు ఇద్దరు ప్రజల సమస్య ల పై పోరాడితే దేశంలోనే ఏపీ ఓ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మిగిలిపోతుందని అంటున్నారు..  పాల‌క ప్ర‌తిప‌క్ష నేత‌లు క‌లిసి వెళ్ల‌డం చూడ ముచ్చ‌ట‌గా, ఆరోగ్య‌క‌ర‌మైన రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -